సోషల్ మీడియాలో అపోలో హాస్పిటల్‌తో మాట్లాడండి:

Breadcrumb Images
అపోలో హాస్పిటల్స్విధానములేపరోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ

లేపరోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ

పిత్తాశయం అంటే ఏమిటి?

పిత్తాశయం అనేది బేరీపండు ఆకారపు అవయవం, ఇది కాలేయం యొక్క కుడి వైపున ఉంటుంది.

పిత్తాశయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాలేయం ద్వారా ఉత్పత్తి అయ్యే జీర్ణ స్రవాన్ని (పైత్యం అని అంటారు) సేకరించి సాంద్రతరం చేస్తుంది. పైత్యం అనేది ఏదేని తిన్న తరువాత పిత్తాశయం నుండి విడుదల అవుతుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. సన్నని మైనపు వత్తి లాంటి ట్యూబులర్ ఛానల్ (పిత్త వాహికలు) ద్వారా పైత్యం చిన్న ప్రేగులోకి చేరుతుంది.

పిత్తాశయం తొలగింపు జీర్ణక్రియ యొక్క ఎలాంటి వైకల్యతకు సంబంధం కలిగి ఉండదు.

పిత్తాశయoలో రాళ్ళు

పిత్తాశయoలోని రాళ్ళు కొలెస్ట్రాల్ మరియు పైత్యంలో ఉండే ఇతర పదార్థాల నుండి తయారవుతాయి. అవి ఇసుక కణం కంటే చిన్నవిగా లేదా గోల్ఫ్ బంతుల కంటే పెద్దవిగా ఉంటాయి.
ఊబకాయం ఉన్నవారు లేదా వేగంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల పిత్తాశయoలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది.
పిత్తాశయంలో రాళ్ళు ఉండటాన్ని యాక్యూట్ కోలేసిస్టిటిస్ అని పిలువబడే పరిస్థితికి కారణమవుతుంది, అంటే పిత్తాశయ వాపుకు దారి తీస్తుంది. ఇది కడుపు నొప్పి ద్వారా వెన్ను భాగంలో మండటo, వాంతులు, అజీర్ణం మరియు కొన్నిసార్లు జ్వరం వంటి లక్షణాలను కలిగిస్తుంది.
కొంతమందిలో పిత్తాశయ రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి అనేది అనిశ్చితం. పిత్తాశయ రాళ్ళు సాధారణ పిత్త వాహికను అడ్డుకుంటే, కామెర్లు (చర్మం పసుపుగా మారడం) సంభవిస్తుంది. ఇది వెంటనే గుర్తించబడకపోతే మరియు చికిత్స చేయకుండా వదిలేస్తే, రోగిలో పిత్తవాహినీశోథ అనే పరిస్థితికి, ఇది వణికించే తీవ్రతర జ్వరానికి దారితీస్తుంది.
పిత్తాశయ వ్యాధి ఎలా నిర్ధారణ చేయబడుతుంది మరియు చికిత్స ఎలా చేయబడుతుంది?
పిత్తాశయ రాళ్లను కనుగొనడానికి సాధారణంగా ఉపయోగించే పరీక్ష అల్ట్రాసౌండ్, అయితే MRI లేదా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ (EUS) వంటి మరీ క్లిష్టమైన పరిశోధనలు చేయవచ్చు. కాలేయo యొక్క పనితీరు సాధారణమైనదని నిర్ధారించడానికి మీకు కొన్ని రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

పిత్తాశయంలోని రాళ్ళు వాటియంతటగా తొలగించబడవు. కొన్ని తాత్కాలికంగా ఔషధాల సహాయంతో లేదా కొవ్వు సంబంధిత పదార్థాలను తీసుకోవడాన్ని తగ్గించడం వంటి ఆహార సర్దుబాట్ల ద్వారా చేయవచ్చు. ఈ చికిత్స తక్కువ, స్వల్పకాలిక సఫలీకృతను సూచిస్తుంది. పిత్తాశయం తొలగించే వరకు ఈ లక్షణాలు కొనసాగుతూనే ఉంటాయి.

శస్త్రచికిత్స ద్వారా పిత్తాశయం తొలగింపు పిత్తాశయ వ్యాధి యొక్క సరియైన మరియు సురక్షితమైన చికిత్స.

ఎవరికి కోలిలిస్టెక్టమీ చేయాలి?
పైన వివరించిన పిత్తాశయరాళ్ళు మరియు సంబంధిత లక్షణాలతో బాధపడుతున్న రోగులలో తీవ్రరూపం దాల్చే ముందు కోలిసిస్టెక్టమీ చేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు పిత్తాశయ రాళ్ళు లేనివారిలో సంబంధిత లక్షణాలు కనిపించినచో కోలిసిస్టెక్టమీ చేయవలసి ఉంటుంది.
అరుదుగా, పెద్ద పిత్తాశయ పాలిప్స్ (అసాధారణ పెరుగుదల) ఉన్న రోగులకు పిత్తాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నందున కోలిసిస్టెక్టమీ చేయవలసి ఉంటుంది.

పిత్తాశయం ఎలా తొలగించబడుతుంది?

పిత్తాశయాన్ని తొలగించే అత్యంత సాధారణ పద్ధతి లాపరోస్కోపిక్ (కీహోల్) శస్త్రచికిత్స.

లాపరోస్కోప్ అని పిలువబడే కెమెరా, ఇది అధిక-తీవ్రత కలిగిన కాంతికి అనుసంధానించబడి ఉంటుంది, ఇది మీ నాభి (బొడ్డు) లో చిన్న గాటు చేయుట ద్వారా ప్రవేశపెట్టబడుతుంది. శస్త్రచికిత్సా పరికరాలను ప్రవేశపెట్టడానికి మూడు చిన్న గాట్లు (పొత్తి కడుపులో ఒకటి మరియు కుడి వైపున మీ పక్కటెముకల క్రింద రెండు) వేస్తారు. శస్త్రచికిత్సకు అవకాశం కల్పించడానికి, మీ కడుపులో కార్బన్ డయాక్సైడ్­ నింపబడుతుంది.

కాలేయం నుండి పిత్తాశయం వేరుచేయబడినప్పుడు, పిత్త వాహికలు మరియు రక్త నాళాలకు కనెక్షన్ కత్తిరించిన తర్వాత, బొడ్డు కోత ద్వారా తొలగించబడుతుంది.

సుమారు 3–5% కేసులలో పిత్తాశయాన్ని లాపరోస్కోపిక్ చికిత్స ద్వారా సురక్షితంగా తొలగించలేము మరియు సాంప్రదాయక ఓపెన్ టెక్నిక్ (లాపరోటోమీ) ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి మీ కుడి ప్రక్కటెముకకు సమాంతరంగా మీ పై పొత్తికడుపులో 15-సెం.మీ వరకు గాటు పెట్టవలసి వస్తుంది. ఇది ఒక పెద్ద ప్రక్రియ మరియు ఆసుపత్రిలో చాలా రోజుల పాటు ఉండవలసి ఉంటుంది.

వాస్తవ విధానానికి ముందు లేదా చికిత్స సమయంలో మీ వైద్యుడు తీసుకున్న నిర్ణయం ఓపెన్ విధానంతో కొనసాగడం అనేది ఒక ఎంపిక. లాపరోస్కోపిక్ విధానాన్ని ఓపెన్ విధానంగా మార్చడం సురక్షితం అని సర్జన్ భావించినప్పుడు, ఇది ఒక సమస్యగా కాదు, కానీ గొప్ప శస్త్రచికిత్సా విధానంగా పరిగణించాలి. ఓపెన్ విధానానికి మార్చే ఎంపిక రోగి యొక్క భద్రతపై ఖచ్చితంగా దృష్టి సారిస్తుంది.

పిత్తాశయం అనేది పైత్యాన్ని నిల్వ చేసే ఒక అవయవం, ఇది క్రమమైన వ్యవధిలో కుంచించుకుపోతుంది మరియు పైత్యాన్ని చిన్న ప్రేగులకు చేరేలా సహాయపడుతుంది. పిత్తాశయం లేకపోయినా, కాలేయం ద్వారా పైత్యం నిరంతరం ఉత్పత్తి అవుతుంది మరియు చిన్న ప్రేగులోకి వెళుతుంది. పిత్త వాహికలు ఆరోగ్యకరమైన పనితీరుకు అవసరమైన పైత్యాన్ని నిల్వ చేస్తాయి.

లాపరోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ చికిత్స పూర్తయిన తర్వాత నేను ఏమి చేయాలి?

నేను ఎంతకాలం ఆసుపత్రిలో ఉంటాను?

చాలా మంది రోగులు శస్త్రచికిత్సకు ముందు రోజు రాత్రి ఆసుపత్రిలో చేరుతారు మరియు మొదటి శస్త్రచికిత్స తరువాత రోజు (ఇన్-పేషెంట్ సర్జరీ) నుండి డిశ్చార్జ్ అవుతారు. అయినప్పటికీ, కొంతమంది రోగులు వారి శస్త్రచికిత్స కోసం ఉదయం ఆసుపత్రికి వస్తారు, అదే రోజు సాయంత్రం (డే-కేర్ సర్జరీ) డిశ్చార్జ్ చేయబడతారు. మీ వయస్సు, లక్షణాలు, ఫిట్‌నెస్ మరియు ఇతర వైద్యసంబంధిత వ్యాధుల ఆధారంగా మీ శస్త్రచికిత్సను ఇన్-పెసేంట్­గా చేయాలా లేదా డే-కేర్‌గా చేయాలా అనేది మీ సర్జన్ నిర్ణయిస్తారు.

ఆపరేషన్ చేసే ముందు ఏమి జరుగుతుంది?

ప్రత్యేకించి మీరు సాధారణ అనస్థీషియా తీసుకోవాలి వస్తే, ఆపరేషన్ అయిన తర్వాత మీ సంరక్షణ మరియు కోలుకోవడం కోసం సరియైన ప్లానింగ్ చేసుకోవాలి.

కార్యాలయంలో విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం కావాలని చెప్పాలి. మీ రోజువారి కార్యకలాపాల్లో మీకు సహాయపడేలా ఇతర వ్యక్తుల సహాయం తీసుకోవాలి. మీరు రోజూ వైద్య పరిస్థితిని బట్టి ఆస్పిరిన్ తీసుకుంటుంటే, మీ శస్త్రచికిత్సకు ముందు తీసుకోవడం మానేయాలా అనేది మీ వైద్యుని అడిగి తెలుసుకోవాలి.
మీరు ఏయే మందులు తీసుకుంటున్నారో మీ వైద్యుడికి చెప్పాలి.

రక్త పరీక్షలు, ECGలు, చెస్ట్ X-రే వంటి ముందస్తు అనస్థీషియా పరీక్షలు చేయించుకోమని మీతో చెప్పవచ్చు మరియు అనస్థీషియా తీసుకొనుటకు మీ ఫిట్‌నెస్‌ను అంచనా వేసే అనస్థీషియా బృందం కూడా నిర్థారణ చేస్తారు.

మీ డాక్టర్ మీకు ఇచ్చే అన్ని ముందస్తు శస్త్రచికిత్స సూచనలను అనుసరించాలి. చికిత్స ప్రక్రియకు ఒక రాత్రి ముందు మీరు తేలికపాటి భోజనం తీసుకోవాలని సాధారణంగా సిఫార్సు చేయబడతారు. ద్రవ పదార్థాలు తీసుకోవద్దని డాక్టర్ చెప్పిన తరువాత కాఫీ, టీ, నీరు లేదా ఇతర ద్రవ పదార్థాలు తీసుకోవద్దు.

సర్జరీకి ముందు రాత్రి మీకు భేదిమందు ఇవ్వబడవచ్చు లేదా ఉదయాన శస్త్రచికిత్సకు ముందు మీరు ఎనిమా తీసుకోవచ్చు.

ఆపరేషన్ తర్వాత ఏమి జరుగుతుంది?

ఆపరేషన్ పూర్తయిన తర్వాత మీరు ఆపరేటింగ్ గదిలో మేల్కొని ఉంటారు మరియు రికవరీ గదికి మార్చబడతారు. మీ చేతిలో ఇంట్రావీనస్ లైన్ ఉంటుంది, అది ఫ్లూయిడ్­తో కనెక్ట్ చేయబడి ఉంటుంది మరియు ఆసుపత్రి సిబ్బంది మీకు మందులను అందించే వీలు కల్పిస్తుంది. మీ నోటి పైన ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది, అది కావలసిన ఆక్సిజన్‌ను అందిస్తుంది. రక్తపోటు కొలిచే పట్టీ మీ చేతుల్లో ఒకదానిపై అమర్చబడి ఉంటుంది మరియు మీ రక్తపోటును కొలవడానికి అడపాదడపా ఇన్­ఫ్లేట్ చేయబడుతుంది. అరుదుగా, ఇది ప్రత్యేకంగా చాలా కష్టతరమైన ఆపరేషన్ అయితే మీ పొత్తి కడుపులో ఏదైనా ద్రవం చేరితే సేకరించడానికి ఒక డ్రెయిన్ ఉంచబడుతుంది. శస్త్రచికిత్స పూర్తయిన కొన్ని గంటల తర్వాత మీరు సాధారణంగా బెడ్ నుండి లేవగలరు, అయినప్పటికీ నర్సులు మీకు మొదటిసారిగా సహాయం చేస్తారు.

ఆపరేషన్ తర్వాత నాకు ఎంత ఎక్కువగా నొప్పి కలుగుతుంది?

చాలా మందికి తేలికపాటి నుండి సాధారణ నొప్పిని మాత్రమే అనుభవిస్తారు, ఇది నోటి ద్వారా తీసుకొనే అనాల్జేసియా (పెయిన్ కిల్లర్స్) తో సులభంగా తగ్గించబడుతుంది. ముఖ్యంగా మీ కదలిక వలన మీకు గాయాల నుండి కొంత నొప్పి కలుగవచ్చు. మీరు అలా చేస్తే, నొప్పిని తగ్గించడానికి నర్సులు మీకు మందులు ఇస్తారు. మీరు కొంత భుజంలో నొప్పిని గమనించవచ్చు, దీనిని శస్త్రచికిత్స సమయంలో మీ పొత్తికడుపులో గాలి చేరినందున దాని వలన నొప్పి కలుగుతుంది. ఈ గాలి నెమ్మదిగా కనుమరుగవుతుంది కాని అసౌకర్యంగా చాలా రోజుల వరకు ఉండవచ్చు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే సమయంలో నొప్పి నివారణ మందులు మరియు మీరు ఎప్పుడు ఏమిటి తీసుకోవాలో తెలియజేసే శస్త్రచికిత్స అనంతర సూచనలు ఇవ్వబడతారు. 3 నుండి 5 రోజుల తర్వాత మీకు కలిగే అసౌకర్యం చాలా వరకు తగ్గిపోతుంది.
నేను సాధారణ కార్యకలాపాలను ఎప్పుడు చేసుకోగలను?

మీకు సౌకర్యంగా ఉన్నప్పుడు మీరు సాధారణ శారీరక మరియు లైంగిక కార్యకలాపాలను చేసుకోవచ్చు. శస్త్రచికిత్స తర్వాత అలసటతో కూడిన అనుభూతిని చెందడం సాధారణం, కాబట్టి రోజుకు రెండు లేదా మూడు సార్లు విశ్రాంతి తీసుకోండి మరియు రాత్రివేళలో మంచి నిద్ర పొందడానికి ప్రయత్నించండి. వారం లేదా ఆ తరువాత, మీరు మీ సాధారణ రోజువారీ కార్యకలాపాలను చేసుకోగలుగుతారు. మీరు కనీసం రెండు వారాల పాటు భారీ లిఫ్టింగ్ మరియు చురుకైన వ్యాయామానికి దూరంగా ఉండాలి.

నేను ఆహారంగా ఏయే పదార్థాలు తినవచ్చు?

పిత్తాశయం తొలగించిన తర్వాత ఆహార నియంత్రణలు ఏమియూ లేవు మరియు మీకు ఆకలిగా అనిపిస్తే మీరు సాధారణ ఆహారాన్ని తీసుకోవచ్చు. మీకు బాగా ఆకలి వేయడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. ఆకలిగా ఉన్నప్పుడు తేలికపాటి ఆహారంతో మొదలై మీ సాధారణ ఆహారపు అలవాట్లకు చేరుకోవచ్చు.

నా ప్రేగులో కదలికలు ఎప్పుడు సాధారణం అవుతాయి?

సాధారణ ప్రేగు కదలికలు పొందడానికి మూడు లేదా నాలుగు రోజులు పట్టవచ్చు.

ఎలాంటి సమస్యలు కలుగవచ్చు?

ఏ రకమైన శస్త్రచికిత్సలో అయినా కొన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ, లాపరోస్కోపిక్ కోరాలిస్టెక్టమీ చేయించుకొన్న చాలా మంది రోగులకు కొన్ని ప్రమాదాలు ఉండవచ్చు లేదా ఎలాంటి ప్రమాదాలు లేకపోవచ్చు మరియు త్వరగా సాధారణ కార్యకలాపాలను చేసుకోగలుగుతారు. ఏ రకమైన శస్త్రచికిత్సకు అయినా చేయించుకొనే ముందు – లాపరోస్కోపిక్ లేదా ఓపెన్ అయినా, మీరు మీ సర్జన్‌ను చికిత్స విధానం మరియు శస్త్రచికిత్స అనంతర దశతో కలిగే సమస్యలు మరియు ప్రమాదాల గురించి అడగాలి.
లాపరోస్కోపిక్ కొలెస్టెక్టమీ అనేది తరచూ ఆందోళన కలిగించే సంఘటన, కానీ రక్తస్రావం, ఇన్ఫెక్షన్, న్యుమోనియా, రక్తం గడ్డకట్టడం లేదా గుండె సమస్యలతో సహా. సాధారణ పిత్త వాహిక లేదా చిన్న ప్రేగు ప్రక్కనే ఉన్న అవయవాలకు అనుకోకుండా గాయం సంభవించవచ్చు మరియు దాన్ని సరిచేయడానికి మరొక శస్త్రచికిత్సా విధానం అవసరం కావచ్చు.
సరిగా శిక్షణ పొందిన సర్జన్ చేత చేయబడినప్పుడు లాపరోస్కోపిక్ పిత్తాశయ శస్త్రచికిత్సకు సంక్లిష్టత రేటు చాలా తక్కువగా ఉంటుందని అనేక వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Quick Book

Request A Call Back

X