సోషల్ మీడియాలో అపోలో హాస్పిటల్‌తో మాట్లాడండి:

Breadcrumb Images
అపోలో హాస్పిటల్స్విధానముటోటల్ హిప్ రీప్లేస్మెంట్

టోటల్ హిప్ రీప్లేస్మెంట్

ప్రక్రియ విధానం ఏమిటి?

హిప్ రీప్లేస్మెంట్ లేదా టోటల్ హిప్ ఆర్థ్రోప్లాస్టీ అనేది ఒక శస్త్రచికిత్స, దీనిలో హిప్ జాయింట్ యొక్క వ్యాధిగ్రస్థ మృదులాస్థి మరియు ఎముకలను తొలగించి వాటి స్థానంలో ఒక కృత్రిమ జాయింట్ (ప్రొస్థెసిస్) తో మార్పిడి చేయడం.

ఇది ఎందువలన చేయబడుతుంది?

మీ హిప్ జాయింట్ అరిగిపోయినప్పుడు లేదా అది మీ కదలికను ప్రభావితం చేసేలా పాడయినప్పుడు, మీరు భరించలేని నొప్పిని అనుభవిస్తారు మరియు మందులు లేదా శారీరక చికిత్స ద్వారా ఇది నయం కానప్పుడు టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయవలసి ఉంటుందని మీ డాక్టర్ సిఫారసు చేస్తారు. హిప్ రీప్లేస్మెంట్ కోసం, ఆస్టియో ఆర్థరైటిస్ కాకుండా చాలా వరకు సాధారణమైన కారణం:

  • కీళ్ళ వాతం
  • తుంటి బీటిక
  • సెప్టిక్ ఆర్థరైటిస్
  • యాంకైలోసింగ్ స్పాండిలైటిస్
  • ఎముక యొక్క అసాధారణ పెరుగుదల కారణంగా కలిగే లోపాలు (బోన్ డిస్ప్లాసియాస్)

ప్రక్రియ నిర్వహించే సమయంలో ఏమి జరుగుతుంది?

హిప్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్స జరిగే సమయంలో, మీ సర్జన్ మీ హిప్ ముందు భాగంలో లేదా ప్రక్క భాగంలో గాటు వేస్తారు. వ్యాధిగ్రస్థ లేదా పాడయిన హిప్ జాయింట్ తొలగించబడుతుంది మరియు కృత్రిమ జాయింట్ అమర్చబడుతుంది.

ఎంత సమయం పడుతుంది?

మీ ఆరోగ్య స్థితిని బట్టి హిప్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్స కోసం సాధారణంగా 60-90 నిమిషాలు పడుతుంది.

ప్రక్రియ చేయబడిన తర్వాత ఏమి జరుగుతుంది?

రక్తం గడ్డకట్టడం మరియు నొప్పి నిర్వహణను నివారించడం మీరు వాడే మందులను బట్టి ఉంటుంది. ఫిజికల్ థెరపిస్ట్ వ్యాయామాన్ని సిఫారసు చేస్తారు మరియు మీకు నడవడానికి సహాయ పడే ఉపకరణాన్ని అందజేస్తారు.

ప్రక్రియ నిర్వహణలో అపోలో నైపుణ్యత

హిప్ ఆర్థ్రోస్కోపీ మరియు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీలో భారతదేశపు మొట్టమొదటి ఆసుపత్రి అపోలో హాస్పిటల్.

సంప్రదిస్తూ ఉండండి

మా ఆర్థోపెడిక్ సర్జన్లను సంప్రదించడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు

నేను ఎప్పుడు డ్రైవ్ చేయగలను?

మీరు శస్త్రచికిత్స చేయబడిన తర్వాత నాలుగు నుండి ఆరు వారాలలో డ్రైవింగ్ చేయవచ్చు అయితే, మీరు నొప్పి నివారణ మందులు తీసుకుంటున్నప్పుడు డ్రైవింగ్ చేయుటకు అనుమతించబడరు. డ్రైవింగ్ చేసే ముందు మీరు మీ వైద్యునితో చర్చించడం మంచిది.

టోటల్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పునరావాస ప్రక్రియ ఏమిటి?

టోటల్ హిప్ జాయింట్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత, మీరు వెంటనే మీ శారీరక వ్యాయామాలను ఆరంభిస్తారు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత మొదటి రోజునే, కుర్చీలో కూర్చోని మీరు చేయగలిగే కొన్ని చిన్న శారీరక వ్యాయామాలను మీ ఫిజికల్ థెరపిస్ట్ చేయిస్తారు. క్రమంగా, పునరావాస ప్రక్రియలో అడుగులు వేయుట, నడక మరియు మెట్లు ఎక్కడం దిగటం వంటివి ఉంటాయి. ప్రారంభంలో వాకర్స్ లేదా క్రచెస్ వంటి సహాయక ఉపకరణాలు ఉపయోగిస్తారు. కొంత అసౌకర్యం అనేది సాధారణం. హిప్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సకు శారీరక వ్యాయామం చాలా వరకు ముఖ్యమైనది. శారీరక చికిత్స యొక్క లక్ష్యాలు ముడుచుకుపోవడం వంటివి నివారించడం, రోగికి ఆరోగ్య సంబంధిత విషయాలను తెలియజేయడం మరియు నియంత్రిత వ్యాయామాల ద్వారా హిప్ జాయింట్ చుట్టూ కండరాలను బలోపేతం చేయడం. ఇంటి వద్ద చేయదగిన వ్యాయామ కార్యక్రమాలు మరియు షెడ్యూల్ ప్రకారం అవుట్ పేషెంట్ సంబంధిత ఫిజికల్ థెరపీలో పాల్గొనవలసి ఉంటుంది.

హిప్ రిప్లేస్మెంట్ చేయబడిన తర్వాత నేను ఎలాంటి పనులకు దూరంగా ఉండాలి?

మీరు చురుకుగా ఉండటం ముఖ్యం, రికవరీ ప్రక్రియలో ఇది సహాయపడుతుంది. అయితే, అధిక ప్రభావాన్ని చూపే కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఎటువంటి అయోమయానికి గురికాకుండా ఉండేలా మీరు మీ వైద్యునితో సంప్రదించవలసినదిగా మేము సూచిస్తున్నాము.

Quick Book

Request A Call Back

X