సోషల్ మీడియాలో అపోలో హాస్పిటల్‌తో మాట్లాడండి:

Breadcrumb Images
అపోలో హాస్పిటల్స్విధానముకరోనరీ యాంజియోప్లాస్టీ

కరోనరీ యాంజియోప్లాస్టీ

కరోనరీ యాంజియోప్లాస్టీ అంటే ఏమిటి?

కరోనరీ యాంజియోప్లాస్టీ, పెర్క్యుటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్ అని కూడా అంటారు, ఇది గుండెకు సరఫరా చేసే ధమనులలో బ్లాకేజి అయిన వాటిని తెరవటానికి ఉపయోగించే ఒక ప్రక్రియ. ఈ ధమనులను కరోనరీ ఆర్టరీస్ అంటారు. యాంజియోప్లాస్టీలో మీ ధమని బాకేజి అయినప్పుడు చిన్న బెలూన్‌ను తాత్కాలికంగా చొప్పించడం మరియు దానిలో గాలిని నింపడం జరుగుతుంది, ఇది ధమనిని సాగేలా చేయడంలో సహాయపడుతుంది.

యాంజియోప్లాస్టీ అనేది మూసుకుపోయిన ధమనిని తెరవడం మరియు మూసుకుపోయే అవకాశాన్ని తగ్గించడంలో సహాయపడటానికి స్టెంట్ అని పిలువబడే చిన్న వైర్ మెష్ ట్యూబ్ యొక్క స్థిరమైన అమరికతో సాధారణంగా జతచేయబడి ఉంటుంది. మీ ధమని తెరిచి ఉంచడానికి (డ్రగ్-ఎల్యూటింగ్ స్టెంట్లు) సహాయపడటానికి కొన్ని స్టెంట్లు మందులతో పూత పూయబడి ఉంటాయి, మరికొన్ని (బేర్-మెటల్ స్టెంట్లు) అలా ఉండవు.

యాంజియోప్లాస్టీ మూసుకుపోయిన గుండె ధమనుల వలన ఛాతీ నొప్పి మరియు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను మెరుగుపరుస్తుంది. గుండెపోటు వచ్చే సమయంలో మూసుకుపోయిన ధమనిని త్వరగా తెరవడానికి మరియు మీ గుండెకు హాని కలిగించే ప్రభావాన్ని తగ్గించడానికి యాంజియోప్లాస్టీని కూడా ఉపయోగించవచ్చు.

కరోనరీ యాంజియోప్లాస్టీ ఎందుకు చేస్తారు?

అథెరోస్క్లెరోసిస్ అని పిలువబడే ఒక రకమైన గుండె జబ్బులకు చికిత్స చేయడానికి యాంజియోప్లాస్టీ చేస్తారు. మీ గుండె రక్త నాళాలలో [కరోనరీ ఆర్టరీస్] కొవ్వు నిల్వలను నెమ్మదిగా వృద్ధి చెందడాన్ని అథెరోస్క్లెరోసిస్ అని అంటారు. మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి మందులు లేదా జీవనశైలి మార్పులు సరిపోవనప్పుడు లేదా మీకు గుండెపోటు, తీవ్రమైన ఛాతీ నొప్పి (యాంజినా) లేదా ఇతర లక్షణాలు ఉన్నప్పుడు మీ వైద్యుడు యాంజియోప్లాస్టీ చికిత్సను ఎంపికగా సూచించవచ్చు.

యాంజియోప్లాస్టీ అనేది అందరికీ చేయదగినది కాదు. మీ గుండె యొక్క ఎడమ వైపుకు రక్తాన్ని తీసుకువచ్చే ప్రధాన ధమని ఇరుకైనపుడు, మీ గుండె కండరం బలహీనంగా ఉన్నా లేదా మీకు అనేక వ్యాధుల బారిన పడిన రక్త నాళాలు ఉన్నా, కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అనేది యాంజియోప్లాస్టీ కంటే ఒక మంచి ఎంపిక.

ఈ క్లిష్టమైన క్లినికల్ నిర్ణయం వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది మరియు దీనిని అపోలో హార్ట్ టీమ్ నిర్ణయిస్తుంది. కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీలో, మీ శరీరంలోని మరొక భాగం నుండి తీసిన రక్తనాళాన్ని ఉపయోగించి మీ ధమని యొక్క బ్లాక్ చేయబడిన భాగానికి బైపాస్ చేయబడుతుంది.

బైపాస్ శస్త్రచికిత్సకు వ్యతిరేకంగా యాంజియోప్లాస్టీ యొక్క నిర్ణయం అనేది మీ వ్యాధి యొక్క పరిధి, కరోనరీ ధమనులలోని అవరోధం యొక్క పరిధి మరియు మీయొక్క మొత్తం వైద్య స్థితిపై ఆధారపడి ఉంటుంది.

మీరు ఎలా సిద్ధం అవుతారు?

యాంజియోప్లాస్టీకి ముందు, మీ డాక్టర్ మీ వైద్య చరిత్రను అంచనా వేస్తారు మరియు శారీరకంగా పరీక్షిస్తారు. మీ అవరోధాలను యాంజియోప్లాస్టీతో చికిత్స చేయవచ్చో లేదో తెలుసుకోవడానికి కరోనరీ యాంజియోగ్రామ్ అని పిలువబడే ఇమేజింగ్ పరీక్ష కూడా మీకు చేయవలసి ఉంటుంది. కరోనరీ యాంజియోగ్రామ్ వలన మీ గుండెకు చేరే ధమనులు ఇరుకైనవా లేదా మూసుకుపోయినవా అనేది గుర్తించడంలో వైద్యులకు సహాయపడుతుంది.

కరోనరీ యాంజియోగ్రామ్‌లో, క్యాథెటర్ ద్వారా మీ గుండె ధమనులలోకి ద్రవపు వర్ణ పదార్ధం – మీ నడుము, చేయి లేదా మణికట్టు నుండి ఒక ధమని ద్వారా మీ గుండెలోని ధమనులకు చేరుకొనే ఒక పొడవైన, సన్నని గొట్టం ద్వారా ఇంజెక్ట్ చేయబడుతుంది. ఈ వర్ణ పదార్ధం మీ ధమనులలోకి ప్రవేశించినప్పుడు, అవి X-రేస్ మరియు వీడియోలలో కనిపిస్తాయి, కాబట్టి మీ ధమనులు ఎక్కడ మూసుకుపోయావి అనేది మీ డాక్టర్ చూడవచ్చు. మీకు కరోనరీ యాంజియోగ్రామ్ చేసే సమయంలో మీ వైద్యుడు ఏదైనా బ్లాకేజి ఉన్నట్లు కనుగొంటే, మీ గుండె ఇంకా క్యాథెటరైజ్ చేయబడినప్పుడు యాంజియోగ్రామ్ తర్వాత వెంటనే యాంజియోప్లాస్టీ మరియు స్టెంటింగ్ చేయాలని అతను నిర్ణయించుకుంటారు.

సాధారణంగా, మీరు చికిత్సా ప్రక్రియ షెడ్యూల్ చేయడానికి ఆరు నుండి ఎనిమిది గంటల ముందు తినడం లేదా త్రాగటం వంటివి మానేయాలి. మీ చికిత్స ప్రారంభానికి ముందు మీరు ఆసుపత్రిలో చేరి ఉంటే, మీ యొక్క సంసిద్ధత భిన్నంగా ఉండవచ్చు.

మీరు మొదట చాతి X-రే, ఎలక్ట్రో కార్డియోగ్రామ్స్ మరియు రక్త పరీక్షలతో సహా కొన్ని సాధారణ పరీక్షలను నిర్వహించబడతారు.

యాంజియోప్లాస్టీకి ముందు మీరు ప్రస్తుతo వాడే మందులను రెగ్యులరైజ్ చేయడం గురించి మీ డాక్టర్ యొక్క సలహాను అనుసరించాలి. యాంజియోప్లాస్టీకి ముందు కొన్ని మందులు తీసుకోవడం మానేయమని మీ డాక్టర్ మీకు సూచించవచ్చు.

క్లినికల్ పరిశోధనలలో ఉపయోగించే ద్రవపు వర్ణ పదార్ధం వలన అలాగే ఇంతకు మునుపు ఎదుర్కొన్న అలెర్జీల గురించి మీ వైద్యునికి తెలియజేయాలి.

చికిత్స జరిగే సమయంలో మీరు ఏమిటి ఆశించవచ్చు

కాలు, చేయి లేదా మణికట్టులోని రక్తనాళానికి పైన చర్మంపై చాలా చిన్న గాటు చేయబడుతుంది, దీని ద్వారా చిన్న, సన్నని గొట్టం (క్యాథెటర్) థ్రెడ్ చేయబడి ప్రాసెస్ చేయబడుతుంది.

ఒక గుండె చికిత్స నిపుణుడు (కార్డియాలజిస్ట్) మరియు ప్రత్యేకమైన కార్డియోవాస్కులర్ నర్సులు మరియు సాంకేతిక నిపుణుల బృందం కార్డియాక్ క్యాథెటరైజేషన్ లాబొరేటరీ (క్యాథ్ ల్యాబ్) అని పిలువబడే ఒక ప్రత్యేక ఆపరేటింగ్ గదిలో యాంజియోప్లాస్టీ చేయబడుతుంది.

యాంజియోప్లాస్టీ సాధారణంగా మీ మణికట్టు ప్రాంతంలో (రేడియల్ ఆర్టరీ) లేదా మీ మొల ప్రాంతంలో (ఫెమోరల్ ధమని) చేయబడిన గాటు యొక్క సంక్లిష్టతను బట్టి జరుగుతుంది. అరుదుగా, ఇది మీ చేయి లేదా మణికట్టు ప్రాంతంలో గల ధమనిని ఉపయోగించి చేయబడవచ్చు. చికిత్సకు ముందు, ఈ ప్రాంతం క్రిమినాశక ద్రావణంతో శుభ్రం చేయబడుతుంది మరియు మీ శరీరంపై ఒక క్రిమినాశక షీట్ ఉంచబడుతుంది.

క్యాథెటర్ చొప్పించబడే ప్రదేశాన్ని తిమ్మిరి చేయడానికి స్థానిక అనస్థీషియా ఇంజెక్ట్ చేయబడుతుంది. ప్రక్రియ సమయంలో, మీ గుండెను పర్యవేక్షించడానికి చిన్న ఎలక్ట్రోడ్ ప్యాడ్లు మీ ఛాతీపై ఉంచబడతాయి.

సాధారణ అనస్థీషియా అవసరం లేదు. ఈ ప్రక్రియలో మీరు మత్తులో ఉంటారు, కానీ మేల్కొనే ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉండేలా ఒక IV లైన్ ద్వారా మీశరీరంలోకి ద్రవాలు, మందులు మరియు రక్తం పలుచబడటానికి (ప్రతిస్కందకాలు) అందించబడతాయి.

అప్పుడు, ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది:

గాటు వేసే ప్రాంతాన్ని తిమ్మిరి చేసిన తరువాత, మీ కాలు లేదా చేతి ధమనిలోకి ప్రవేశించడానికి ఒక చిన్న సూదిని ఉపయోగిస్తారు. చర్మంపై ఒక చిన్న గాటు వేస్తారు.మీ వైద్యుడు అప్పుడు సన్నని గైడ్‌వేర్‌ను చొప్పించి, మీ గుండెలోని బ్లాకేజి వరకు చేరే వరకు క్యాథెటర్ ధమనిలోకి ప్రవేశిస్తుంది. క్యాథెటర్ చొప్పించిన ప్రదేశంలో కూడా మీకు నొప్పిగా అనిపించకపోవచ్చు, కానీ మీకు నొప్పిగా అనిపిస్తే మీ డాక్టరుకు తెలియజేయాలి. మీ శరీరంలో క్యాథెటర్ ఉన్నా కూడా మీకు ఏమియూ అనిపించదు.

క్యాథెటర్ ద్వారా చిన్న మొత్తంలో వర్ణ పదార్ధం ఇంజెక్ట్ చేయబడుతుంది. యాంజియోగ్రామ్స్ అని పిలువబడే X-రే చిత్రాలపై బ్లాకేజి కనుగొనడంలో ఇది మీ వైద్యునికి సహాయపడుతుంది. బ్లాకేజి ఉన్న ధమనిని సాగేలా చేయడానికి డాక్టర్ క్యాథెటర్ చివరిలో ఒక చిన్న బెలూన్‌ను ఉంచి దానిలో గాలి నింపుట వలన దమని సాగుతుంది. ధమని సాగిన తరువాత, బెలూన్‍లోని గాలి ఖాళీ అవుతుంది మరియు బెలూన్ తొలగించబడుతుంది. మీ వైద్యుడు ధమనిని కొంచెం ఎక్కువగా సాగేలా చేయడానికి బెలూన్ తొలగించే ముందు అందులో గాలి నింపడం మరియు తీసివేయడం వంటివి కొన్ని సార్లు చేయవలసి ఉంటుంది.

మీరు అనేక బ్లాకేజీలను కలిగి ఉంటే, ప్రతీ బ్లాకేజీలో ఈ ప్రక్రియ పునరావృతo చేయబడుతుంది. బెలూన్ మీ గుండెలోని ఒక భాగంలో రక్త ప్రవాహాన్ని క్షణికావేశంలో ఆపివేస్తుంది కాబట్టి, అది ఉబ్బినప్పుడు సాధారణంగా ఛాతీ నొప్పిని కలిగిస్తుంది.

స్టెంట్ ప్లేస్‌మెంట్

యాంజియోప్లాస్టీ చేయించుకొన్న చాలా మందికి అదే ప్రక్రియలో వారి బ్లాకేజి గల ధమనిలో స్టెంట్ కూడా ఉంచబడుతుంది. స్టెంట్ సాధారణంగా ధమనిలోకి చొప్పించబడుతుంది, ఎందుకంటే గాలి ద్వారా సాగిన బెలూన్ వలన దమని వెడల్పు అవుతుంది. యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత మళ్ళీ ఇరుకుగా కాకుండా నిరోధించడానికి స్టెంట్ మీ ధమని గోడలకు మద్దతు చేస్తుంది. స్టెంట్ వైర్ అనేది మెష్ యొక్క చిన్న కాయిల్ వలే కనిపిస్తుంది.

స్టెంట్‌ ఎలా అమర్చబడుతుంది?

క్యాథెటర్ చివర బెలూన్ చుట్టూ అమర్చబడిన స్టెంట్ ధమని ద్వారా బ్లాకేజి ఉన్న చోటకు పంపబడుతుంది.

బ్లాకేజి ఉన్న చోట, బెలూన్ ఉబ్బుతుంది, స్ప్రింగ్ లాంటి స్టెంట్ ధమని లోపల విస్తరించి గట్టిగా అతుక్కొంటుంది.

స్టెంట్ ధమని ఎల్లప్పుడూ తెరవబడి ఉండేలా చేస్తుంది మరియు మీ గుండెకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని సందర్భాల్లో, బ్లాకేజి తెరవడానికి ఒకటి కంటే ఎక్కువ స్టెంట్లు అవసరం కావచ్చు.

స్టెంట్ అమర్చిన తర్వాత, బెలూన్ క్యాథెటర్ తొలగించబడుతుంది, ప్రస్తుతం విస్తరించబడిన మీ ధమని నుండి రక్తం ఎలా ప్రవహిస్తుందో చూడటానికి మరిన్ని చిత్రాలు (యాంజియోగ్రామ్స్) తీయబడతాయి.

చివరగా, గైడెడ్ క్యాథెటర్ తొలగించబడుతుంది మరియు ప్రక్రియ పూర్తవుతుంది.

మీ స్టెంట్ ప్లేస్‌మెంట్ చేయబడిన తరువాత, స్టెంట్‌పై రక్తం గడ్డకట్టే అవకాశాలను తగ్గించడానికి మీకు ఆస్పిరిన్ లేదా క్లోపిడోగ్రెల్ వంటి మందులతో సుదీర్ఘకాల చికిత్స తీసుకోవలసి ఉంటుంది.

నాళాల సంఖ్య, బ్లాకుల పరిధి, వయస్సు, కేల్సిఫైడ్ నాళాలు మొదలైనవాటిని బట్టి ప్రక్రియ కోసం 90 నిమిషాల నుండి 150 నిమిషాల వరకు సమయం తీసుకొంటుంది.

అపోలో హాస్పిటల్‌లో, ఇంట్రా-వస్కులర్ అల్ట్రాసౌండ్ (IVUS), ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ (OCT) మరియు ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ (FFR) వంటి ఆధునిక ఇమేజింగ్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇంట్రాకరోనరీ ఇమేజింగ్‌లో నాళాలు మరియు బ్లాకేజీ యొక్క కొలతలను ఖచ్చితంగా కొలవడం, నాళాల పరిమాణాన్ని అంచనా వేయడం, లెసియన్ పదనిర్మాణ శాస్త్రాన్ని వర్గీకరించడం మరియు ఆప్టిమల్ పెర్క్యుటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్ (PCI) ను మార్గనిర్దేశం చేసే సామర్థ్యం కలిగి ఉంది.

ప్రక్రియ అనంతరం చేయవలసినవి

మీకు హై రిస్క్ ప్రక్రియ చేయబడితే, మీరు 3 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుంది; వీటిలో, మీరు 1 లేదా 2 రోజులు ICU లో నిశితంగా మానిటర్ చేయబడతారు మరియు డిశ్చార్జ్ చేయుటకు ఒక రోజు ముందు వార్డుకు బదిలీ చేయబడతారు. లో రిస్క్ ప్రక్రియలలో, మరుసటి రోజునే రోగులు డిశ్చార్జ్ అవుతారు. మీరు సాధారణంగా యాంజియోప్లాస్టీ చేసుకొన్న ఒక వారం తర్వాత పనికి లేదా మీ సాధారణ దినచర్యకు తిరిగి రాగలుగుతారు.

మీరు ఇంటికి తిరిగి చేరుకున్నాక, మీ శరీరo నుండి కాంట్రాస్ట్ డై బయిటకి ఫ్లష్ చేయడంలో సహాయపడటానికి పుష్కలంగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. కనీసం ఒక రోజు వరకు కఠినమైన వ్యాయామం మరియు భారీ వస్తువులను ఎత్తడం వంటివి చేయరాదు. ప్రక్రియకు సంబంధించి పాటించవలసిన ఇతర నియమాలు గురించి మీ వైద్యుని అడిగి తెలుసుకోవలెను.

యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత కొనసాగే జీవితం

బ్లడ్ థిన్నర్స్

రక్తం పలుచబడటం మరియు ఇతర సంబంధిత ఔషధాల చికిత్స గురించి మీరు మీ వైద్యుని యొక్క సిఫార్సులను జాగ్రత్తగా పాటించడం చాలా ముఖ్యం. మీ కార్డియాలజిస్ట్­ని సంప్రదించకుండా ఎటువంటి మందులను ఆపుచేయవద్దు.

గుండెను ఆరోగ్యకరమైన జీవనశైలిలోకి మార్చడం

కరోనరీ యాంజియోప్లాస్టీ చేయుట వలన గతంలో ఇరుకైన లేదా బ్లాకేజి చేయబడిన కరోనరీ ఆర్టరీ ద్వారా ఇప్పుడు రక్త ప్రవాహాన్ని పెరిగేలా చేస్తుంది. మీ ఛాతీ నొప్పి సాధారణంగా తగ్గాలి మరియు మీరు బాగా వ్యాయామం చేయగలుగుతారు.

యాంజియోప్లాస్టీ మరియు స్టెంటింగ్ చేయించుకోవటం వల్ల మీ గుండె జబ్బులు పూర్తిగా తొలగిపోతాయని మాత్రం కాదు. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను కొనసాగించాలి మరియు మీ డాక్టర్ సూచించిన ప్రకారం మందులు తీసుకోవాలి.

యాంజియోప్లాస్టీ తర్వాత మీ గుండె ఆరోగ్యంగా ఉండటానికి, మీరు:

ధూమపానం మానేయాలి

మీ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించాలి

ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండాలి డయాబెటిస్ మరియు అధిక రక్తపోటు వంటి ఇతర వ్యాధులను నియంత్రించాలి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి

Quick Book

Request A Call Back

X