సోషల్ మీడియాలో అపోలో హాస్పిటల్‌తో మాట్లాడండి:

Breadcrumb Images
అపోలో హాస్పిటల్స్విధానముకరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ

కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ

కరోనరీ యాంజియోప్లాస్టీ అంటే ఏమిటి?

కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (CABG) అనేది కరోనరీ ధమనుల ద్వారా గుండెకు రక్త ప్రవాహాన్ని పెంచే ఒక శస్త్రచికిత్స. ఇది కరోనరీ దమని వ్యాధి అని కూడా పిలువబడే తీవ్రతర కరోనరీ హార్ట్ డిసీజ్ (CHD) తో బాధపడేవారికి సూచించబడుతుంది.

CHD అనేది ఒక వ్యాధి, దీనిలో ఫ్లేక్ అని పిలువబడే ఒక భాగం కరోనరీ ధమనుల లోపల ఏర్పడుతుంది. ఈ ధమనులు మీ గుండెకు ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తాన్ని సరఫరా చేస్తాయి. రక్తంలో లభించే కొవ్వు, కొలెస్ట్రాల్, కాల్షియం మరియు ఇతర పదార్థాల నుండి ఫ్లేక్ తయారవుతుంది. ఫ్లేక్ వలన కరోనరీ ధమనులు ఇరుకుగా మారుతాయి లేదా బ్లాకేజి ఏర్పరుస్తుంది మరియు గుండె యొక్క కండరానికి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. బ్లాకేజి తీవ్రంగా ఉంటే, యాంజినా, శ్వాస ఆడకపోవడం, మరియు, కొన్ని సందర్భాల్లో, గుండెపోటు సంభవించవచ్చు. యాంజినా అనే పదం గుండె కండరాలకు సరైన రక్త ప్రవాహం తగ్గడం వల్ల ఛాతీ నొప్పి లేదా అసౌకర్యాన్ని కల్గిస్తుంది.

CABG అనేది CHD కోసం ఒక చికిత్స. CABG చేసే సమయంలో, మీ శరీరంలోని ఆరోగ్యవంతమైన ఒక ధమని లేదా సిర బ్లాకేజి గల కరోనరీ ఆర్టరీకి కనెక్ట్ చేయబడుతుంది లేదా గ్రాఫ్టింగ్ చేయబడుతుంది. గ్రాఫ్టింగ్ చేయబడిన ధమని లేదా సిర కరోనరీ ఆర్టరీ యొక్క బ్లాకేజి గల భాగాన్ని బైపాస్ (ఇది, ఎక్కువ దూరం ప్రవహిస్తుంది) చేస్తుంది. ఇది కొత్త మార్గాన్ని ఏర్పరుస్తుంది మరియు గుండె కండరాలలోని బ్లాకేజి చుట్టూ ఆక్సిజన్ అధికంగా గల రక్తం ప్రవహిస్తుంది.

CABG ఎందుకు నిర్వహించబడుతుంది?

కరోనరీ బైపాస్ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ లేదా స్టెంటింగ్ వంటి ప్రత్యామ్నాయ ఆర్టరీ-ఓపెనింగ్ ప్రక్రియ మీకు సరైనదా కాదా అనేది మీ డాక్టర్ మీతో చర్చిస్తారు.

కరోనరీ బైపాస్ సర్జరీ ఒక ఎంపిక అయితే:

మీ గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే అనేక ధమనుల బ్లాకేజి వల్ల మీకు తీవ్రమైన ఛాతీ నొప్పి కలుగుతుంది, తేలికపాటి వ్యాయామం చేసే సమయంలో లేదా విశ్రాంతి సమయంలో కూడా కండరాలలో రక్తం తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు యాంజియోప్లాస్టీ మరియు స్టెంటింగ్ సహాయపడతాయి, అయితే కరోనరీ బైపాస్ సర్జరీ కొన్ని రకాల బ్లాకేజీలకు సరియైన ఎంపిక.

మీరు ఒకటి కంటే ఎక్కువ వ్యాధిగ్రస్త కరోనరీ ఆర్టరీ కలిగి ఉన్నారు మరియు గుండె యొక్క ప్రధాన పంపింగ్ గది అయిన ఎడమ జఠరిక సరిగా పనిచేయడం లేదు.

మీ ఎడమ ప్రధాన కరోనరీ ఆర్టరీలో ఫ్లేక్ బాగా పేరుకుపోయింది లేదా మూసుకుపోయింది. ఈ ధమని ఎడమ జఠరికకు ఎక్కువగా రక్తాన్ని సరఫరా చేస్తుంది.

మీకు ఇప్పటికే ఉన్న బ్లాకేజికి యాంజియోప్లాస్టీ చికిత్స సరైనది కాదు, మీకు ఇంతకు ముందు యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్ ప్లేస్‌మెంట్ చేయబడింది, అది సఫలీకృతం కాలేదు, లేదా మీరు స్టెంట్ వేయించుకున్నారు, కానీ ధమనిలో ఫ్లేక్ మళ్ళీ పేరుకుపోయింది (రెస్టెనోసిస్).

మీరు ఇతర చికిత్సల వలన ప్రయోజనం పొందలేకపోవడాన్ని మీ వైద్యుడు చూస్తే, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో కరోనరీ బైపాస్ సర్జరీ కూడా చేయవచ్చు.

ఈ శస్త్రచికిత్స వలన మొదటి సారిగా బ్లాకేజిని కలిగించే ప్రధాన గుండె జబ్బులకు ఎలాంటి చికిత్స అందించదు. అందువల్ల, మీరు కరోనరీ బైపాస్ సర్జరీకి గురైనప్పటికీ, జీవనశైలిలో మార్పులు అనేవి శస్త్రచికిత్స తర్వాత చేయబడే నిర్వహణలో ఒక ముఖ్యమైన భాగం. మీ రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించడానికి అలాగే మీ గుండె పనితీరు సరిగా ఉండేలా చేయడానికి శస్త్రచికిత్స తర్వాత మందుల వాడకం కొనసాగించాల్సి ఉంటుంది.

CABG చికిత్స కోసం ఎలా సిద్ధం కావాలి?

శస్త్రచికిత్స కోసం సిద్ధం కావటానికి, శస్త్రచికిత్సకు ముందు పాటించాల్సిన నిర్దిష్ట సూచనలు అనగా మీ ఆహారం లేదా ఔషధాలలో ఏవైనా పరిమితులు మరియు మార్పుల గురించి వైద్యులు మీకు తెలియజేస్తారు. మీకు చెస్ట్ X-రే, రక్త పరీక్షలు, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ మరియు కరోనరీ యాంజియోగ్రామ్ వంటి అనేక ప్రీ-సర్జికల్ పరీక్షలు చేయవలసి ఉంటుంది. కరోనరీ యాంజియోగ్రామ్ అనేది ఒక రకమైన X-రే విధానం, ఇది కరోనరీ ధమనులను గుర్తించగలిగేలా చేయడానికి ఒక వర్ణ పదార్థాన్ని ఉపయోగిస్తుంది. శస్త్రచికిత్సకు ఒకటి లేదా రెండు రోజుల ముందు మిమ్మల్ని ఆసుపత్రిలో చేరమని సలహా ఇస్తారు మరియు శస్త్రచికిత్సకు మూడు నుండి ఏడు రోజుల ముందు ఉపయోగించబడిన యాంటీ-ప్లేట్లెట్స్­ను బట్టి యాంటీ ప్లేట్‌లెట్స్ వాడకం నిలిపివేయబడుతుంది.

మీ శస్త్రచికిత్స తర్వాత కొన్నివారాలపాటు ఉండేలా అవసరమైన వాటిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు తిరిగి డ్రైవింగ్‌ చేయడానికి, తిరిగి పనిలో చేరడానికి మరియు రోజువారీ పనులను చేయగలుగుటకు మీకు నాలుగు నుండి ఆరు వారాల సమయం పడుతుంది

మీరు ఏమి ఆశించవచ్చు

ప్రక్రియ జరిగే సమయంలో కరోనరీ బైపాస్ సర్జరీకి సాధారణ అనస్థీషియా అవసరం అవుతుంది. మీ గుండెలోని బ్లాకేజిల స్థానం మరియు వాటి తీవ్రతను బట్టి చేయవలసిన బైపాస్‌ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. సర్జన్స్ చాతి ఎముక వెంబడి ఛాతీ మధ్యలో కట్ చేస్తారు. తరువాత సర్జన్స్ గుండెను బహిర్గతం చేయడానికి పక్కటెముకను తెరుస్తారు. ఈ శస్త్రచికిత్స యొక్క మునుపటి విధానాల్లో, ఛాతి ఓపెన్ చేసిన తరువాత, గుండె తాత్కాలికంగా ఆగిపోతుంది మరియు శరీరంలో రక్తాన్ని ప్రసరించడానికి గుండె-పిరితిత్తుల యంత్రాన్ని ఏర్పాటు చేయబడుతుంది. నేడు, చాలా వరకు CABG ప్రక్రియలు ఆఫ్-పంప్ లేదా బీటింగ్-హార్ట్ సర్జరీ ప్రక్రియలు. ఈ విధానం సర్జన్ పనిచేస్తున్న గుండె యొక్క ప్రాంతాన్ని స్థిరీకరించడానికి ప్రత్యేక పరికరాలను ఉపయోగించి పనిచేస్తూ ఉన్న గుండెపై శస్త్రచికిత్స చేయడానికి అనుమతిస్తుంది. శస్త్రచికిత్సా నిపుణుడు ఆరోగ్యకరమైన రక్తనాళంలో ఒక భాగాన్ని తీసుకొని, తరచూ ఛాతీ గోడ (అంతర్గత క్షీర ధమని) లేదా దిగువ కాలు నుండి, మరియు బ్లాకేజి గల ధమని యొక్క ఎగువ మరియు దిగువ చివరలను జాయింటు చేయడం జరుగుతుంది, తద్వారా రక్త ప్రవాహం వ్యాధిగ్రస్త ధమని యొక్క ఇరుకైన భాగం నుండి మళ్ళించబడుతుంది (బైపాస్). మీ సర్జన్ ఉపయోగించగల ఇతర శస్త్రచికిత్సా విధానాలు కూడా ఉన్నాయి, అవి మినిమల్ ఇన్వాసివ్ కరోనరీ బైపాస్ సర్జరీ వంటివి. ఈ విధానంలో, ఒక సర్జన్ ఛాతీలో చిన్న గాటు పెట్టడం ద్వారా కరోనరీని బైపాస్ చేయగల్గుచున్నారు, తరచూ రోబోటిక్స్ మరియు వీడియో ఇమేజింగ్ ఉపయోగించి సర్జన్ ఒక చిన్న ప్రాంతంలో పనిచేయడంలో సహాయపడుతుంది. మినిమల్ ఇన్వాసివ్ శస్త్రచికిత్స యొక్క మార్పులను పోర్ట్-యాక్సెస్ లేదా కీహోల్ సర్జరీ అని అంటారు. ప్రక్రియ నిర్వహించబడిన తరువాత కరోనరీ బైపాస్ సర్జరీ అనేది ఒక పెద్ద ఆపరేషన్. కరోనరీ బైపాస్ సర్జరీ తర్వాత కొన్ని రోజుల పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉండవలసి ఉంటుంది. ఇక్కడ, మీ గుండె, రక్తపోటు, శ్వాస మరియు ఇతర ముఖ్యమైన లక్షణాలు నిరంతరం పర్యవేక్షించబడతాయి. మీ శస్త్రచికిత్స చేయబడిన వెంటనే CABG ప్రక్రియలో జనరల్ అనస్థీషియా ఉపయోగించబడుతుంది, కాబట్టి మీరు శస్త్రచికిత్స చేయబడిన తర్వాత చాలా గంటలు పాటు మూర్ఛపోవచ్చు. మీరు ఇంకా అపస్మారక స్థితిలో ఉంటే, ఇప్పుడే ఒక ఆవశ్యకమైన శస్త్రచికిత్స చేయబడిన వ్యక్తుల కోసం కేటాయించబడిన ఒక ప్రత్యేక వార్డు అయిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు మిమ్మల్ని తీసుకెళ్లవచ్చు. మీరు ఒకటి నుండి మూడు రోజుల పాటు ఈ యూనిట్‌లో ఉండవచ్చు. ఎక్కువ సమయం అక్కడ ఉండడం అనేది మీ CABG శస్త్రచికిత్స విజయవంతం కాలేదని మాత్రం కాదు. ఉదాహరణకు, మీ అనస్థీషియా ప్రభావం తగ్గడానికి లేదా మీ ఛాతీలో వర్ణ పదార్ధం ప్రవహించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందని దీని అర్థం. మీరు మేల్కొన్నప్పుడు, చాలా రకాల అనుభూతులను పొందవచ్చు. మీరు బహుశా రోగగ్రస్తులుగా ఉన్నట్లు భావించవచ్చు. అనస్థీషియా మీకు వికారం కలిగిస్తుంది, కాబట్టి మీకు కడుపులో అసౌకర్యంగా అనిపించవచ్చు. మీకు శ్వాస తీసుకోవడంలో సహాయపడటానికి మీ గొంతులో అమర్చబడిన గొట్టం కారణంగా మీరు మింగడం లేదా మాట్లాడటం చేయలేరనేది మీరు వెంటనే గమనించవచ్చు.

అయితే సాధారణంగా CABG శస్త్రచికిత్స అసౌకర్యo అనిపించకుండా ఉండేలా అనస్థీషియా యొక్క ప్రభావం సహాయపడుతుంది, కానీ మీరు మేల్కొన్న తర్వాత కూడా కొంత నొప్పిని అనుభవించవచ్చు. ఈ అసౌకర్యాన్ని అధిగమించడానికి, మీ శస్త్రచికిత్స అయిన తర్వాత మీ ఇంట్రావీనస్ (IV) లైన్ ద్వారా నేరుగా మీ నర్సు మీకు నొప్పి నివారణ మందులను ఇస్తుంది.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుండి ఇతర వార్డులలోకి బదిలీ చేయబడటం

మీ పరిస్థితి మెరుగుపడినప్పుడు, మీరు ప్రత్యేక వార్డు నుండి సాధారణ గుండె సంరక్షణ విభాగానికి బదిలీ చేయబడతారు, కొన్నిసార్లు దీనిని స్టెప్-డౌన్ యూనిట్ అని అంటారు. మీరు సాధారణంగా క్రింది పరిస్థితులలో బదిలీ చేయబడతారు:

మీ శ్వాస గొట్టం తొలగించబడినప్పుడు.

మీరు ఔషధాలను నోటి ద్వారా తీసుకోగలిగినప్పుడు.

హానికర గొట్టాలు మరియు పర్యవేక్షణ అవసరాలు తగ్గించబడటం. మీ మూత్రాశయంలో ఉంచిన క్యాథేటర్ మీకు ఇక అవసరం లేనప్పుడు.
మీరు స్టెప్-డౌన్ యూనిట్‌లో ఉన్నప్పుడు, మీరు బెడ్ నుండి లేచి కాస్త అటూ ఇటూ తిరగవచ్చు.

ఏవైనా క్లిష్ట సమస్యలను మినహాయించి, మీరు ఎనిమిది రోజులలోపు (ICU లో రెండు నుండి మూడు రోజులు మరియు వార్డులో రెండు నుండి మూడు రోజులు) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది, అయినప్పటికీ ఆసుపత్రి నుండి బయలుదేరిన తర్వాత కూడా, మీయొక్క నిత్యకృత్యాలను చేయడంలో లేదా కొద్ది దూరం నడవడంలో ఇబ్బంది పడవచ్చు.

కోలుకోవటానికి సుమారు ఆరు నుండి పన్నెండు వారాల సమయం పడుతుందని అంచనా వేయవచ్చు. చాలా సందర్భాలలో, మీరు నాలుగు నుండి ఆరు వారాల తర్వాత మరల పని చేసుకోవడం, వ్యాయామం చేయడం మరియు లైంగిక కార్యకలాపాలు వంటివి ప్రారంభించవచ్చు, కాని అలా చేయడానికి ముందు మీరు మీ వైద్యుని అనుమతి పొందాలనేది నిర్ధారించుకోండి.

ఫలితాలు

శస్త్రచికిత్స తర్వాత, చాలా మంది రోగులు మంచి అనుభూతి చెందుతారు మరియు 10 నుండి 15 సంవత్సరాల వరకు ఎలాంటి వ్యాధి లక్షణం లేకుండా ఉంటారు.

CABG చేసిన తరువాత జీవన విధానం

బైపాస్ సర్జరీ ద్వారా గుండెకు రక్త సరఫరాను మెరుగుపరుస్తున్నప్పుడు, దీనికి ఆధారమైన కరోనరీ ఆర్టరీ వ్యాధి నయం చేయబడదు. మీ ఫలితాలు మరియు దీర్ఘకాలిక పరిణామాలు అనేవి రక్తం గడ్డకట్టడం నివారించడం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ తగ్గించడం మరియు నిర్దేశించిన ప్రకారం మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడటానికి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి సిఫార్సులను అనుసరించడానికి మీ యొక్క ఔషధాల వాడకంపై ఆధారపడి ఉంటుంది.

ధూమపానం మానేయడం

ఆరోగ్యకరంగా ఆహారం తీసుకనే ఒక విధానాన్ని అనుసరించడం, DASH నియతాహారo వంటిది

ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒత్తిడిని నియంత్రించడం

ఆసుపత్రి మరియు మీ వైద్య బృందంతో సన్నిహితంగా ఉండండి లేదా 1066 కు కాల్ చేయండి:

మీకు అధిక జ్వరం ఉంటే

వేగవంతoగా గుండె కొట్టుకోవడం

మీ ఛాతి గాయం చుట్టూ కొత్తగా లేదా తీవ్రమైన నొప్పి

మీ ఛాతి గాయం చుట్టూ ఎర్రబడటం లేదా రక్తస్రావం కావటం లేదా మీ ఛాతి గాయం నుండి ఇతర స్రావాలు డిశ్చార్జ్ కావటం

Quick Book

Request A Call Back

X