సోషల్ మీడియాలో అపోలో హాస్పిటల్‌తో మాట్లాడండి:

Breadcrumb Images
అపోలో హాస్పిటల్స్విధానముయోని సంబంధిత గర్భాశయ శస్త్రచికిత్స – గర్భాశయం తొలగింపు

యోని సంబంధిత గర్భాశయ శస్త్రచికిత్స – గర్భాశయం తొలగింపు

యోని సంబంధిత గర్భాశయ శస్త్రచికిత్స అంటే ఏమిటి?

యోని సంబంధిత గర్భాశయ శస్త్రచికిత్స సమయంలో, యోని పైభాగంలో చేయబడిన చిన్న కోత ద్వారా గర్భం మరియు గర్భాశయాన్ని తొలగిస్తారు. ప్రత్యేకమైన శస్త్రచికిత్సా పరికరాలను యోనిలోకి చొప్పించి, పిండాన్ని స్థిరంగా ఉండేలా పట్టుకొని ఉన్న స్నాయువులను వేరుచేస్తారు.

పిండం మరియు గర్భాశయము తొలగించబడిన తరువాత, కోత కుట్టబడుతుంది.

యోని సంబంధిత గర్భాశయ శస్త్రచికిత్సను ఉపయోగించి ఇలా చేయవచ్చు: సాధారణ మత్తుమందు – ఈ ప్రక్రియ సమయంలో మీరు అచేతన స్థితిలో ఉంటారు లేదా వెన్నెముక ద్వారా ఇచ్చే మత్తుమందు – ఇక్కడ మీ నడుము క్రింది భాగం మొద్దుబారిపోతుంది

గర్భాశయ శస్త్రచికిత్స ఎప్పుడు చేయబడుతుంది?

గర్భాశయాన్ని తొలగించాల్సిన అవసరానికి అనేక కారణాలు ఉంటాయి. గర్భాశయ శస్త్రచికిత్సతో చికిత్స చేయబడే కొన్ని వ్యాధులు: ఔషధాలు లేదా విస్ఫారణం మరియు అవయవ గోడలను గీకడం (D&C) ద్వారా నియంత్రించబడని తరచుగా అయ్యే భారీ రక్తస్రావం

ఎండోమెట్రియోసిస్ అనేది నొప్పి లేదా రక్తస్రావాన్ని కలిగిస్తుంది మరియు ఇతర చికిత్సలకు స్పందించదు దీర్ఘకాలిక కటి నొప్పి ప్రోలాప్స్ గర్భాశయం – వ్రాలాడే గర్భాశయం గర్భాశయంలో ముందస్తు కేన్సర్ లేదా క్యాన్సర్ కలిగించే కణాలు లేదా కణజాలం కలిగి ఉండటం గర్భాశయoలో కణితిలు

గర్భాశయాన్ని తొలగించబడే ఇతర మార్గాలు: ఉదర సంబంధిత గర్భాశయ శస్త్రచికిత్స – ఉదరంలో చిన్న కోత ద్వారా గర్భాశయాన్ని తొలగించడం పొత్తికడుపులో కీహోల్ వంటి గాటు వేయుట ద్వారా లాపరోస్కోపిక్ హిస్టెరెక్టోమీ ఉదరంలో చేసిన కీహోల్ వంటి గాటు ద్వారా రోబోటిక్ గర్భాశయ శస్త్రచికిత్స హిస్టెరోస్కోపీ, లాపరోస్కోపీ, రోబోటిక్ సర్జరీని ఇలా ఉపయోగించవచ్చు: గర్భాశయాన్ని తొలగించకుండా ఎండోమెట్రియోసిస్ యొక్క భాగాన్ని తొలగించడం గర్భాశయాన్ని తొలగించకుండా కణితిని (ఫైబ్రాయిడ్లు) తొలగించడం

ఈ ఎంపికల గురించి మీరు మీ వైద్యుడిని అడగాలి, కానీ మీ వైద్యుడు మీ వైద్య స్థితికి తగిన గర్భాశయ శస్త్రచికిత్స పద్ధతిని ఎంచుకున్నట్లు మీరు తెలుసుకొంటారు. కొన్ని సాంకేతిక పద్ధతులు మీ వైద్య పరిస్థితికి సరిపోవు.

యోని సంబందిత గర్భాశయ చికిత్స కోసం నేను ఎలా సిద్ధం కావాలి?

ప్రత్యేకించి మీకు సాధారణ అనస్థీషియా చేయవలసి వస్తే, ఆపరేషన్ చేయబడిన తర్వాత మీ సంరక్షణ మరియు కోలుకోవడం కోసం సరియైన ప్లాన్ చేసుకోవాలి. కార్యాలయంలో విశ్రాంతి కావాలని చెప్పాలి. మీ రోజువారీ విధుల్లో మీకు ఇతర వ్యక్తులు సహాయపడేలా ఏర్పాటు చేసుకోవాలి.

మీ వైద్య స్థితికి సంబంధించి మీరు రోజూ ఆస్పిరిన్ తీసుకొంటున్నట్లయితే, శస్త్రచికిత్సకు ముందు తీసుకోవడం మానేయాలా అనేది మీ వైద్యుని అడిగి తెలుసుకోవాలి. మీరు ఏ మందులను వాడుచున్నారో మీ వైద్యునికి తెలియజేయాలి.

రక్త పరీక్ష, ECG, చెస్ట్ X-రే వంటి ముందస్తు అనస్థీషియా పరీక్ష చేయించుకోమని మీతో చెప్పవచ్చు మరియు అనస్థీషియా కోసం మీ ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి అనస్థీషియా బృందం కూడా నిర్థారణ చేయవచ్చు.

మీ డాక్టర్ మీకు ఇచ్చే అన్ని ముందస్తు శస్త్రచికిత్స సూచనలను పాటించాలి. ప్రక్రియకు ఒక రాత్రి ముందు మీరు తేలికపాటి భోజనం తీసుకోవాలని సాధారణంగా సిఫార్సు చేయబడతారు. ద్రవాలు తీసుకోవద్దని డాక్టర్ చెప్పిన తరువాత కాఫీ, టీ, నీరు లేదా ఇతర ద్రవాలను తీసుకోవద్దు.

శస్త్రచికిత్సకు ముందు రాత్రి మీకు భేదిమందు ఇవ్వవచ్చు లేదా శస్త్రచికిత్సకు ముందు మీరు ఎనిమా తీసుకోవచ్చు.

ప్రక్రియ చేయబడిన తర్వాత ఏమి జరుగుతుంది?

శస్త్రచికిత్స చేయబడిన 1 లేదా 2 రోజుల తరువాత IV మరియు క్యాథెటర్ తొలగించబడతాయి. మీరు సుమారు 3 నుండి 5 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి తీసుకోండి. 4 నుండి 6 వారాల వరకు భారీ బరువులు ఎత్తడం వంటివి చేయవద్దు లేకుంటే ఉదర కండరాలు బెణుకుతాయి. నొప్పిని తగ్గించడానికి మరియు మలబద్దకాన్ని నివారించడానికి మీ కన్సల్టెంట్ సూచనలను పాటించాలి. మీకు శస్త్రచికిత్సకు ముందు ఋతుస్రావం అవుతుంటే, ఆపరేషన్ తర్వాత మీకు అది ఆగిపోతుంది. మీరు గర్భవతి కూడా కాకపోవచ్చు. మీ అండాశయాలు తొలగించబడితే, వెంటనే మెనూపాజ్ ప్రారంభమవుతుంది మరియు మీ డాక్టర్ హార్మోన్ చికిత్సను సూచించవచ్చు. శస్త్రచికిత్సకు ముందు ఈ ప్రభావాల గురించి మరియు చికిత్స సంబంధిత ఏవైనా ఆందోళనలు ఉంటే మీ వైద్యునికి తెలియజేయాలి.

యోని గర్భాశయ శస్త్రచికిత్స తర్వాత నేను దేనిని ఆశించగలను?

సాధారణ అనస్థీషియా వేసిన తరువాత కలిగే ప్రభావాలు

చాలా వరకు ఆధునిక మత్తుమందులు తక్కువ సమయం వరకు పని చేస్తాయి. మీ శస్త్రచికిత్స తర్వాత ఒక రోజు కన్నా ఎక్కువ కాలం మీరు ఎటువంటి ప్రభావాలతో బాధపడకూడదు. మొదటి 24 గంటలలో మీరు సాధారణం కంటే ఎక్కువ సమయం నిద్రపోవచ్చు మరియు మీరు అనుకొన్నట్లుగా జరుగకపోవచ్చు.

క్యాథెటర్

మీ మూత్రాన్ని పీల్చడానికి మీ మూత్రాశయంలో క్యాథెటర్ కలిగి ఉండవచ్చు. ఇది సాధారణంగా మీ ఆపరేషన్ తర్వాత 24 గంటల వ్యవధి వరకు మీ మూత్రాశయాన్ని ఖాళీ చేయడానికి అనగా మీరు టాయిలెట్‌కు సులభంగా నడచి వెళ్ళడానికి ఇది సహాయపడుతుంది. మీకు మూత్ర విసర్జనలో ఇబ్బందిగా ఉంటే, కొన్ని రోజుల వరకు క్యాథెటర్ ఉంచవలసి ఉంటుంది.

పుండు మచ్చలు

యోని సంబంధిత గర్భాశయ శస్త్రచికిత్స అనేది సాధారణంగా యోని ద్వారా నిర్వహించబడుతుంది కాబట్టి అక్కడ మచ్చ ఏమియూ కనిపించదు. అయితే, మీ ఆపరేషన్‌లో భాగంగా మీకు కీహోల్ సర్జరీ చేయబడితే, మీ ఉదరం యొక్క వివిధ భాగాలపై మీకు రెండు మరియు నాలుగు చిన్న మచ్చలు ఉండవచ్చు. ఈ మచ్చ పరిమాణం సుమారుగా 0.5 సెం.మీ మరియు 1 సెం.మీ మధ్య ఉంటుంది

కుట్లు మరియు డ్రెస్సింగ్స్

మీ యోనిలోని కుట్లును తొలగించవలసిన అవసరం లేదు ఎందుకంటే అవి వాటియంతటగా కరిగిపోతాయి. మీరు కొన్ని రోజులు లేదా కొన్ని వారాల తర్వాత ఒక కుట్టు లేదా కుట్టు యొక్క భాగాన్ని చూడవచ్చు. ఇది సాధారణo మరియు ఏమియూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీకు కీహోల్ శస్త్రచికిత్స చేయబడితే, మీకు చేయబడిన గాట్లు మాత్రం కుట్లు లేదా జిగురు ద్వారా మూసివేయబడతాయి. జిగురు మరియు కొన్ని కుట్లు వాటియంతటగా కరిగిపోతాయి. ఇతర కుట్లు తొలగించాల్సిన అవసరం ఉంటుంది, దీని గురించి మీకు సమాచారం ఇవ్వబడుతుంది. మీకు చేయబడిన గాటు మొదట్లో డ్రెస్సింగ్‌తో కప్పబడి ఉంటుంది.

ప్యాక్స్

రక్తస్రావ ప్రమాదాన్ని తగ్గించడానికి శస్త్రచికిత్స తర్వాత మీ యోనిలో ఒక ప్యాక్ ఉంచబడుతుంది. మీరు ఆసుపత్రిలో ఉన్నప్పుడే ఒక నర్సు దీనిని తొలగిస్తుంది.

యోని రక్తస్రావం

మీకు ఆపరేషన్ చేసిన తర్వాత ఒకటి నుండి రెండు వారాల వరకు యోని నుండి కొంత రక్తస్రావం జరుగవచ్చు. ఇది ఒక తేలికపాటి పీరియడ్ వంటిది మరియు ఎరుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. కొంతమంది మహిళలకు మొదట ఒక మోస్తరుగా రక్తస్త్రావం జరుగవచ్చు లేదా రక్తస్రావం జరుగకపోవచ్చు, ఆపై సుమారు 10 రోజుల తరువాత అకస్మాత్తుగా పాత రక్తం లేదా ద్రవ స్రావం కలుగవచ్చు. ఇది సాధారణంగా వెంటనే ఆగిపోతుంది మరియు ఈ కాలంలో మీరు టాంపోన్లకు బదులుగా శానిటరీ టవల్స్ ఉపయోగించాలి ఎందుకంటే టాంపోన్లను ఉపయోగించడం వలన వ్యాధి సంక్రమణ కలిగే ప్రమాదం ఉంది.

నొప్పి మరియు అసౌకర్యం

మీకు ఆపరేషన్ అయిన తర్వాత కనీసం మొదటి కొన్ని రోజులు మీ పొత్తి కడుపులో నొప్పి మరియు అసౌకర్యం కలుగవచ్చు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు, మీకు కలిగే నొప్పికి గాను నొప్పి నివారణ మందులు మీకు ఇవ్వబడతాయి.

ఇరుక్కున్న గాలి

మీ ఆపరేషన్ పూర్తయిన తర్వాత మీ ప్రేగు కొంతకాలం మందగించిపొతుంది, ఎందుకంటే గాలి లేదా ‘విండ్’ ఇరుక్కుపోతుంది. ఇది బయిటకి పొయేవరకు కొంత నొప్పి లేదా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మంచం నుండి లేవటం మరియు బయట నడవడం వలన కొంత ఉపశమనం కలిగిస్తుంది. ప్రేగు కదలిక ప్రారంభమైన తర్వాత, ఇరుక్కున్న గాలి తేలికగా బయిటికి పోతుంది.

తినటం మరియు త్రాగటం ప్రారంభించుట

మీ ఆపరేషన్ అయిన తర్వాత, ద్రవాలను సరిగా తీసుకోవటానికి మీ చేతిలో IV డ్రిప్ ఉంచబడవచ్చు. మీరు మళ్ళీ త్రాగగలిగినప్పుడు, డ్రిప్ తొలగించబడుతుంది. మీకు నీరు లేదా ఒక కప్పు టీ మరియు కొంత తేలికపాటి ఆహారం ఇవ్వబడుతుంది.
రక్తం గడ్డకట్టడం – ఈ ప్రమాదాన్ని ఎలా నివారించాలి

ఏదైనా శస్త్రచికిత్స జరిగిన తర్వాత మీ కాళ్ళలోని సిరల్లో మరియు తుంటి (డీప్ వెయిన్ త్రాంబోసిస్) భాగంలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. ఈ గడ్డలు పిరితిత్తులకు (పల్మనరీ ఎంబాలిజం) ప్రయాణించవచ్చు, ఇది ప్రాణాంతకం కావచ్చు. మీరు గడ్డకట్టే ప్రమాదాన్ని ఇలా తగ్గించవచ్చు: మీ ఆపరేషన్ అయిన తర్వాత వీలైనంత త్వరగా నడవడం/ కదలడం ప్రారంభించాలి. మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వ్యాయామం చేయడం, ఉదాహరణకు: మీ కాలును 30 సెకన్ల పాటు పైకి క్రిందికి కదిలించడం మరియు మీ కాలును గుండ్రంగా 30 సెకన్ల పాటు త్రిప్పడం మరియు మీ కాళ్ళను వంచి- ఒక సమయంలో ఒక కాలు, ప్రతీ సారి కాలుని మూడు సార్లు నిఠారుగా ఉంచాలి.
ప్రత్యేకించి మీరు అధిక బరువు లేదా ఇతర ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటే, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించడానికి మీకు ఇతర పద్ధతుల గురించి కూడా డాక్టరు మీకు సలహా ఇవ్వవచ్చు.

ఫిజియోథెరపీ

మీకు వ్యాయామం గురించి సరియైన నిర్దేశం మరియు సమాచారం ఇవ్వబడుతుంది, తద్వారా మీరు వేగంగా కోలుకుంటారు మరియు ఎటువంటి ఇబ్బంది లేకుండా చైతన్యాన్ని తిరిగి పొందడం ఎలాగో
తెలుసుకోవచ్చు.

అలసట మరియు భావోద్వేగం

సాధారణ శస్త్రచికిత్స తర్వాత మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు ఎందుకంటే మీ శరీరం తనయంతటగా నయం కావడానికి ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. మీరు మొదటి కొన్ని రోజులు పగటిపూట నిద్రపోవలసి ఉంటుంది. గర్భాశయ శస్త్రచికిత్స కూడా మానసికంగా బాధాకరంగా ఉంటుంది మరియు ఈ దశలో చాలా మంది మహిళలు కన్నీటిపాలవుతారు మరియు భావోద్వేగానికి గురవుతారు.

ఒకవేళ ఎక్కువ సమయం తీసుకొన్నట్లయితే

మీ ఆపరేషన్‌కు ముందు మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే; ఉదాహరణకు, డయాబెటిస్ ఉన్న మహిళలు నెమ్మదిగా కోలుకోవచ్చు మరియు అది వ్యాధి సంక్రమణ ప్రమాదానికి దారి తీయవచ్చు. మీరు అధిక బరువు కలిగి ఉన్నపుడు – అనస్థీషియా యొక్క ప్రభావాలను నివారించడంలో రోగులకు ఎక్కువ సమయం పడుతుంది మరియు వ్యాధి సంక్రమణ మరియు థ్రోంబోసిస్ వంటి అధిక ప్రమాద సమస్యలకు దారి తీస్తుంది. మీ శస్త్రచికిత్స సమయంలో ఏదైనా ఇతర సమస్యలు ఉంటాయి.

ఈ సమాచారం గురించి

మీ ఎంపిక మరియు శస్త్రచికిత్స గురించి పొందిన ఇతర సమాచారంతో పాటు మీరు ఈ సమాచారాన్ని ఉపయోగించాలి. ఈ సమాచారం సాధారణ సలహాను ఇస్తుంది. ప్రతి స్త్రీకి వివిధ అవసరాలు ఉంటాయి మరియు వారు వివిధ మార్గాల్లో నయమవుతారు. మీ యంతటగా రికవరీ కావటం దీనిపై ఆధారపడి ఉంటుంది: మీ ఆపరేషన్‌కు ముందు మీరు ఎంత ఫిట్‌గా ఉన్నారు కారణం ఏమిటంటే మీరు గర్భాశయ శస్త్రచికిత్స చేయించుకొన్నారు మీరు చేయించుకొన్న గర్భాశయ శస్త్రచికిత్స యొక్క ఖచ్చితమైన రకం శస్త్రచికిత్స ఎంత తేలికగా చేయబడింది మరియు ఏవైనా సమస్యలు ఉన్నాయా.

Quick Book

Request A Call Back

X