సోషల్ మీడియాలో అపోలో హాస్పిటల్‌తో మాట్లాడండి:

Breadcrumb Images
అపోలో హాస్పిటల్స్విధానముఎముక మజ్జ మార్పిడి

ఎముక మజ్జ మార్పిడి

ఎముక మజ్జ మార్పిడి అంటే ఏమిటి? ఎముక మజ్జ మార్పిడి (BMT) లేదా స్టెమ్ సెల్ మార్పిడి అనేది పాడయిన లేదా వ్యాధిగ్రస్తమైన ఎముక మజ్జను ఒక ఆరోగ్యకరమైన రక్తాన్ని వృద్ది చేసే మూల కణాల­తో రీప్లేస్ చేయడానికి చేసే ప్రక్రియ. మీ ఎముక మజ్జ సరిగా పనిచేయడం మానేసినప్పుడు మరియు తగినంత ఆరోగ్యకరమైన రక్త కణాలను ఉత్పత్తి చేయనప్పుడు ఇది అవసరం అవుతుంది. ఎముక మజ్జ మార్పిడి అనేది ఆటోలోగస్ మార్పిడి (మీ శరీరం నుండి లభించే కణాలు) లేదా అలోజెనిక్ మార్పిడి (ఒక దాత నుండి) కావచ్చు. ఎముక మజ్జ మార్పిడి ఎందుకు చేస్తారు?

కింది కారణాల వల్ల ఆటోలోగస్ మరియు అలోజెనిక్ మార్పిడి నిర్వహిస్తారు:

  • ఆటోలోగస్ మార్పిడి (మీ శరీరం నుండి సేకరించిన మూల కణాలు).
  1. హాడ్కిన్స్ మరియు నాన్-హాడ్కిన్స్ లింఫోమా: ఆవృత్తి / అననుసరణ సందర్భాలలో, ఇది ప్రామాణిక చికిత్స మరియు ఇలాంటి సందర్భాల్లో, ఇది మాత్రమే ఒక చికిత్సా ఎంపిక.
  2. మైలోమా: నివారణ కాకపోయినప్పటికీ, ఇది ప్రారంభ చికిత్సలో భాగంగా ఉండే ఒక ప్రామాణిక చికిత్స, ఎందుకంటే ఇది మనుగడను గణనీయంగా పెంచుతుంది.
  3. లుకేమియా: ఈ వ్యాధిలో నివారణ సంభావ్యతను పెంచే అవకాశం కలిగిన, కన్సాలిడేషన్ థెరపీలో భాగమైన ఒక తీవ్రతర మైలోయిడ్ లుకేమియా.
  • అలోజెనిక్ మార్పిడి (దాత నుండి సేకరించిన మూల కణాలు).
  1. తలసేమియా
  2. ముఖ్యంగా ఒక జన్యువు యొక్క లోపాలతో అనేక ఇతర జన్యుపరమైన సమస్యలు
  3. అప్లాస్టిక్ రక్తహీనత
  4. దీర్ఘకాలిక మైలోయిడ్ లుకేమియా
  5. హై రిస్క్ AML మరియు ఆవృత్తి AML
  6. ఆవృత్త ALL (తీవ్రమైన లింఫోసైటిక్ లుకేమియా)
  7. అనేక ఆధునిక లేదా రిఫ్రాక్తరీ హెమటోలాజికల్ ప్రాణాంతకతకు ఒక ప్రత్యామ్నాయంగా. ఉదా. ఫోలిక్యులర్ లింఫోమా, CLL, మైలోమా మొదలైనవి.

ప్రక్రియ సమయంలో ఏమి జరుగుతుంది?

దశ 1: BMT (కండిషనింగ్ ప్రక్రియ) కోసం రోగిని తయారుచేయడం

వ్యాధిగ్రస్త మజ్జను నాశనం చేయడానికి లేదా శరీరంలో మరో చోట క్యాన్సర్‌ను నాశనం చేయడానికి కీమోథెరపీ లేదా రేడియోథెరపీ ఇవ్వబడుతుంది. రోగి యొక్క రోగనిరోధక శక్తిని (అలోజెనిక్ మార్పిడికి అవసరం) తగ్గించేందుకు కూడా ఇది చేయబడుతుంది, తద్వారా డొనేట్ చేయబడిన రక్త మూల కణాలు తిరస్కరించబడవు.

దశ 2: ప్రీ-ఎంగ్రాఫ్ట్­మెంట్ (మార్పిడి చేయబడిన రక్త మూల కణాలు పనిచేయనపుడు ఈ దశ ప్రారంభమవుతుంది) అధిక మోతాదు కెమో-రేడియోథెరపీ చేయబడిన తరువాత, రక్త మూల కణాలు నాశనం అవుతాయి మరియు సాధారణ రక్త కణాలు ఉత్పత్తి చేయబడవు. రోగి శుభ్రమైన మరియు ప్రత్యేక గదిలో ఉంచబడతారు. వారు వ్యాధి సంక్రమణకు గురయ్యే అవకాశం ఉన్నందున, చికిత్స చేయడానికి వారికి యాంటీబయాటిక్స్ అవసరం కావచ్చు.

దశ 3: పోస్ట్-ఎంగ్రాఫ్ట్­మెంట్ (మార్పిడి చేసిన రక్త మూల కణాల పనిచేయుట ఆరంభించిన తర్వాత ఈ దశ ప్రారంభమవుతుంది) ఎముక మజ్జ శరీరంలోకి చేరేటప్పుడు ఇది ప్రారంభమవుతుంది. డొనేట్ చేయబడిన మూల కణాలు చురుకుగా మారతాయి, రోగులు ప్రత్యేక గదుల నుండి బయటకు రావచ్చు. రక్త కణాల సంఖ్య పెరిగేకొద్దీ మీరు డిశ్చార్జ్ కోసం ప్లాన్ చేయవచ్చు. ఏదేమైనా, మీరు రెగ్యులర్ చెకప్ కోసం రావాలి మరియు ఏదైనా సంభావ్య ఆరోగ్య సమస్యలు లేదా గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ ప్రతిచర్యల గురించి తనిఖీ చేయించుకోవాలి.

ఎంత సమయం పడుతుంది?

దశ 1: BMT కి ముందు, కండిషనింగ్ విధానం నిర్వహిస్తారు, ఇది సాధారణంగా 2–10 రోజులు పడుతుంది.

దశ 2: ప్రీ-ఎంగ్రాఫ్ట్­మెంట్ దశ సాధారణంగా 2-3 వారాల సమయం తీసుకొంటుంది.దశ 3: పోస్ట్- ఎంగ్రాఫ్ట్­మెంట్ ఎముక మజ్జ శరీరంలో చేరిన 2 – 5 వారాల తరువాత ప్రారంభమవుతుంది మరియు అది నయం అయ్యే వరకు కొనసాగే సుదీర్ఘమైన దశ.

ప్రక్రియ తర్వాత ఏమి జరుగుతుంది?

ఒక కొత్త కణం శరీరంలోకి ప్రవేశించినప్పుడు, అది రక్త కణాల ఉత్పత్తి చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో, క్రొత్త కణం రక్తం ద్వారా మీ ఎముక మజ్జకు ప్రయాణిస్తుంది మరియు అనేక కణాలను ఉత్పత్తి చేయుట ప్రారంభిస్తుంది. మీ శరీరంలోని రక్త కణాల సంఖ్య సాధారణ స్థితికి రావడానికి 2 నుండి 6 వారాల సమయం పడుతుంది. మీ ఆరోగ్య స్థితిని పర్యవేక్షించడానికి మీరు రక్త పరీక్ష చేయించుకుంటారు. ఎప్పటికప్పుడు, మీ ఎముక మజ్జ తనయంతటగా తగినన్ని కణాలను ఉత్పత్తి చేయటం ప్రారంభించే వరకు మీకు రక్త కణాలు మరియు ప్లేట్‌లెట్ల మార్పిడి చేయబడవచ్చు. వ్యాధి సంక్రమణ మరియు రోగనిరోధక వ్యవస్థ ప్రతిచర్యలను నివారించడానికి మీకు మందులు ఇవ్వబడతాయి.

అపోలో హాస్పిటల్స్ పని చేస్తున్న దానిపై ఏదైనా సమాచారం

భారతదేశంలోని అపోలో హాస్పిటల్స్­లోని బ్లడ్ అండ్ బోన్ మారో ట్రాన్స్-ప్లాంట్ సెంటర్ అద్భుతమైన విజయాలతో 1500 కి పైగా ఎముక మజ్జ మార్పిడులు చేశాయి.

ప్రక్రియలో అపోలో నైపుణ్యం

అపోలో హాస్పిటల్స్ అనేది రోగులకు BMT లో ఒక విశ్వసనీయ పేరు, ఎందుకంటే ఆసుపత్రిలో అధిక అర్హత కలిగిన BMT బృందం ఉండటమే కాకుండా, BMT రోగులకు ముఖ్యమైన వ్యాధి సంక్రమణ నియంత్రణ ప్రమాణాలు కూడా ఉన్నాయి. చెన్నై, న్యూ డిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్ మరియు కోల్‌కతాలోని అపోలో హాస్పిటల్లో BMT చికిత్స అందుబాటులో ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఎముక మజ్జ అంటే ఏమిటి

ఎముక మజ్జ ఒక ప్రత్యేకమైన, మెత్తటి, కొవ్వు కణజాలం, ఇది రక్త మూల కణాలను కలిగి ఉంటుంది. ఈ మూల కణాలు కొన్ని పెద్ద ఎముకల లోపల ఉంటాయి మరియు అవి వాటియంతటగా తెల్ల రక్త కణాలు మరియు ఎర్ర రక్త కణాలు మరియు ప్లేట్‌లెట్లుగా మారుతాయి. ఎముక మజ్జ, మన శరీరంలో రక్త కణాలను ఉత్పత్తి చేసే ముఖ్యమైన బాధ్యత కలిగి ఉంది. ఎముక మజ్జ ఎలా సేకరించబడుతుంది? ఎముక మజ్జ సేకరణ ఒకటి లేదా రెండు వారాలలో చేయబడుతుంది, రోగికి (లేదా దాత, అలోజెనిక్ మార్పిడి కోసం) 1 నుండి 2 యూనిట్ల రక్తం తొలగించబడవచ్చు. ఎముక మజ్జ తిరిగి సేకరణ జరిగే సమయంలో ఇది తిరిగి ఇవ్వబడుతుంది.

ఈ సేకరణ సాధారణ అనస్థీషియాతో జరుగుతుంది, కాబట్టి ఎవరూ ఎలాంటి అనుభూతి చెందరు. కటి (హిప్ ఎముకలు) వెనుక మరియు ముందు ఎముకల లోపల కొంత మజ్జను తొలగించడం జరుగుతుంది. సాధారణ అనస్థీషియా నుండి పూర్తిగా కోలుకోవడానికి రోగి లేదా దాత రాత్రిపూట ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుంది. ఇది సాధారణంగా కొన్ని రోజులు నొప్పిని కలిగిస్తుంది మరియు తేలికపాటి నొప్పి నివారణ మందులు అవసరం కావచ్చు. వీటిని నర్సులు లేదా వైద్యులు ఇస్తారు.

మూల కణాలు అంటే ఏమిటి? రక్త కణాలు ఇతర మానవ కణాల మాదిరిగానే పెరుగుతాయి. ఎముక మజ్జలో ఇవి “మూల కణం” అని పిలువబడే పితృ కణం నుండి వృద్ధి చెందుతాయి. ఈ మూల కణాలు విభజన చెంది పూర్తిగా వృద్ధి చెందే వరకు పరిపక్వం చెందుతాయి, ఇవి అన్ని రకాల రక్త కణాలను ఏర్పరుస్తాయి: తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్స్ మరియు ఎర్ర రక్త కణాలు. మూల కణాలు పెద్ద ఎముకల మజ్జ స్థానాల్లో సాధారణంగా కనిపిస్తాయి, అయినప్పటికీ, అవి రక్త వ్యవస్థ ద్వారా ఎముక నుండి మరొక ఎముకకు కూడా ప్రయాణించవచ్చు. మన సిరల ద్వారా ప్రసరించే తెల్ల రక్త కణాలలో చాలా తక్కువ శాతం మూల కణాలే. రోగికి లేదా దాతకు ఎముక మజ్జ మార్పిడిలో ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేదు. దాతకు ఇది చాలా సురక్షితమైన విధానం. శరీరంలో ఏదీ శాశ్వతంగా కోల్పోవడం జరుగదు ఉదా. మూత్రపిండ మార్పిడి మాదిరిగా. మూల కణాలు కొద్ది రోజుల్లో పునరుత్పత్తి అవుతాయి. ఈ కారణంగా, USA లో మూల కణాల మార్పిడి కోసం 1 కోటికీ పైగా (10 మిలియన్లు) స్వచ్ఛంద దాతలు ఉన్నారు. ప్రత్యక్ష రక్త మార్పిడి ద్వారా మూల కణాలను రోగికి పంపిస్తారు. మూల కణాలు ఎలా సేకరించబడతాయి?

వృద్ధి కారకం యొక్క రోజువారీ ఇంజెక్షన్ల తర్వాత మూల కణాల సేకరణ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ సుమారు 3 గంటల సమయం తీసుకొంటుంది. రోగిని మంచం మీద పడుకునేలా చేస్తారు మరియు ప్రతీ చేయి యొక్క సిరలో రక్తమార్పిడి చేయబడుతుంది. రక్తం ఒక చేతి నుండి, సెంట్రిఫ్యూజ్ అని పిలువబడే మెషీన్­లో సేకరించబడుతుంది, ఇది మూల కణాలను వేరు చేయడానికి స్పిన్ అవుతుంది. ఇవి సేకరించబడతాయి మరియు మిగిలిన రక్తం మరో చేతికి అమర్చబడిన IV ద్వారా శరీరంలోకి పంపబడుతుంది. మూల కణాలను కూడా స్తంభింపచేయవచ్చు

నాభి నాడి ద్వారా జరిగే రక్త మార్పిడి అంటే ఏమిటి?

లుకేమియా వంటి తీవ్రమైన రక్త వ్యాధులతో బాధపడుతున్న చాలా మంది పిల్లలు మరియు యువకులకు వారికి జీవించడానికి అవకాశం ఇవ్వడానికి ఎముక మజ్జ మార్పిడి చేయాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తు, మజ్జ దానం చేసే దాత ఎల్లప్పుడూ దొరకకపోవచ్చు. అనుకూల దాతను కనుగొనడానికి చాలా సమయం పడుతుంది దాత లభించక ముందే రోగి చనిపోవచ్చు. అయినప్పటికీ, రక్తంలో ఏర్పడే మూలకణాల యొక్క కొత్త మూలం ఇప్పుడు కనుగొనబడింది, అదియే నాభి నాడీ రక్తం. శిశువు ప్రసవించిన తరువాత మావి మరియు నాభి నాడి వెనుక మిగిలి ఉన్న రక్తం ఇది. నాభి నాడి రక్తంలో మూల కణాలు పుష్కలంగా ఉంటాయి మరియు ఎముక మజ్జకు బదులుగా మార్పిడికి ఉపయోగించవచ్చు. నాభి నాడి రక్తంలోని మూల కణాలు అధిక నాణ్యత కలిగి ఉంటాయి మరియు రక్త కణాల ఉత్పత్తిలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. నాభి నాడి రక్త మార్పిడి తక్కువ తీవ్రతర రోగనిరోధక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. దాత మరియు గ్రహీత మధ్య ‘సరిపోలిక’ తక్కువ సంక్లిష్టతను చూపిస్తుంది. ఎముక మజ్జ కంటే మార్పిడి కోసం తగిన నాభి నాడి రక్తాన్ని కనుగొనే సంభావ్యత చాలా ఎక్కువ.

అలోజెనిక్ మార్పిడికి దాత ఎవరు?

దాత యొక్క ప్రత్యేకంగా HLA యాంటిజెన్ (హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్) రోగి యొక్క కణజాల రకంతో సరిపోయేలా ఉండాలి. సాధారణంగా, తోబుట్టువులు తల్లిదండ్రుల వలే సరిపోయే అవకాశం ఉంటుంది. దాత ఆరోగ్యంగా ఉండాలి. నాభి నాడి యొక్క రక్తాన్ని కూడా వాడవచ్చు.

ఎముక మజ్జ లేదా చుట్టూ గల రక్తాన్ని దానం చేయడం ద్వారా దాత ఏదైనా ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటారా?

పరిధీయ రక్తo నుండి మూల కణాల సేకరణ కోసం, అనస్థీషియా అవసరం లేదు మరియు మెషీన్ సెల్ సెపరేటర్‌పై 2-3 గంటలు ప్రక్రియ జరుగుతుంది, సిర నుండి రక్తం తీయబడుతుంది, యంత్రంలో మూల కణాలు వేరుచేయబడతాయి మరియు రక్తం రెండవ చేతి సిర ద్వారా తిరిగి శరీరంలోకి చేరుకొంటుంది. శస్త్రచికిత్స విషయంలో, సాధారణ లేదా స్థానిక అనస్థీషియా చర్మం ద్వారా ఎముకలోకి సూదులు ద్వారా పంపబడుతుంది మరియు మజ్జ తొలగించబడుతుంది. ఈ మొత్తం ప్రక్రియ 2-3 గంటలు తీసుకొంటుంది మరియు నొప్పిలేకుండా ఉంటుంది. దాతకు ఫ్లూ లాంటి లక్షణాలు ఉండవచ్చు, అవి కొన్నిసార్లు అదృశ్యమవుతాయి. ఎముకను కత్తిరించడం లేదా నష్టపరచడం వంటివి జరుగదు. BMT కోసం ఎలా తయారు కావాలి?

మార్పిడి చేయించుకోవడం శారీరకంగా మరియు మానసికంగా చాలా అవసరమైనది. రోగులు వారి భయాలు మరియు ఆందోళనల గురించి మాట్లాడగలిగితే ఇది సహాయపడుతుంది.

ఎవరైనా ఎందుకు మార్పిడి చేయించుకొంటున్నారో మరియు అసలు విధానం ఏమిటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా రోగి ఆచరణాత్మక ఏర్పాట్లు చేయవచ్చు మరియు మానసికంగా కూడా తనను తాను సిద్ధం చేసుకోవచ్చు. రోగి ఆసుపత్రికి వెళ్ళే ముందు మొత్తం ప్రక్రియ గురించి వైద్యులు మరియు నర్సులతో చర్చించడం మంచిది.

తరచుగా అడిగే ప్రశ్నలు ఇక్కడ ఇవ్వబడినవి:

  • చికిత్స యొక్క ప్రయోజనాలు ఏమిటి?
  • చికిత్స యొక్క నష్టాలు ఏమిటి?
  • మార్పిడి చికిత్స నా జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
  • మార్పిడి చికిత్స తర్వాత నేను పిల్లలను పొందగలనా?
  • నేను సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఎంత సమయం పడుతుంది?
  • నాకు అందుబాటులో ఉన్న ఇతర చికిత్సలు ఏవి?
  • వ్యాధి ఎలా వృద్ధి చెందుతుందో ఎవరైనా ఊహించగలరా?
  • నా చికిత్స వ్యక్తులను చూడటంలో నాకు అనారోగ్యంగా అనిపిస్తుందా?
  • నన్ను ఎవరు సందర్శించగలరు?
  • నా చికిత్స వ్యక్తులను చూడటంలో నాకు అనారోగ్యంగా అనిపిస్తుందా?
  • గదిలో టెలివిజన్ ఉందా?
  • గదిలో టెలిఫోన్ లింక్ ఉందా?
  • నేను నా బట్టలు తీసుకురావచ్చా?
  • ఆసుపత్రిలో మరింత సౌకర్యవంతంగా ఉండటానికి నేను ఏమిటి తీసుకురావాల్సి ఉంటుంది?

సందర్శించేవారు ఎక్కడ ఉండవచ్చు?

పూర్తి సమాచారం మరియు సిద్ధం కావడం రోగికి మరియు కుటుంబానికి మార్పిడి ప్రక్రియను సులభతరం చేయడంలో సహాయపడుతుంది.

BMT యొక్క సమస్యలు ఏమిటి?

అన్ని మార్పిడిలవలే, కొన్నిసార్లు రోగులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇందులో ఉండే సమస్యలు విరేచనాలు, వాంతులు, చికాకు లేదా శ్లేష్మ పొరలు, ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం మొదలైనవి. కొన్ని సందర్భాల్లో, హోస్ట్ మార్పిడి ప్రతిరోధకాలను తిరస్కరించవచ్చు లేదా దాత మూల కణాలు గ్రహీతకు వ్యతిరేకంగా స్పందిoచవచ్చు. కానీ రెగ్యులర్ ఫాలో-అప్ మరియు చికిత్సతో, ఈ ప్రతిచర్యల సంభావ్యత గణనీయంగా తగ్గుతుంది.

BMT తరువాత రోగి సాధారణ జీవితాన్ని గడపగలరా?

అవును, వ్యాధి సంక్రమణ అవకాశాలను తగ్గించడం, మంచి పరిశుభ్రత పాటించడం, సమతుల్యమైన, పోషకాహారం తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, అధిక ఒత్తిడిని నివారించడం, క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా ఫాలో-అప్ నిర్వహించడం వంటివి కొన్ని దశలతో, గ్రహీతలు సాధారణ జీవితాన్ని గడపవచ్చు మరియు ఎముక మజ్జ మార్పిడి చేయించుకొన్నవారు BMT యొక్క మొదటి 6 నెలల తర్వాత విద్య, వృత్తి మరియు కుటుంబ జీవితాన్ని గడపవచ్చు.

సంప్రదిస్తూ ఉండండి

మా ట్రాన్స్­ప్లాంట్ బృందంతో అపాయింట్‌మెంట్ పొందడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

Quick Book

Request A Call Back

X