Apollo Hospitals
అపోలో లైఫ్¬లైన్ జాతీయ: 1860-500-1066
అపాయింట్‌మెంట్ కోసం బుక్ చేసుకోండి
Apollo Emergency Number - 1066
Apollo Emergency Number - 1066
Joint Commission International
Mobile Navigation

సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్

ఆరోగ్య సంరక్షణలో ఉత్తమమైన వాటికి మీకు తక్కువ అందించడానికి ఉత్తమ నిపుణులను మరియు పరికరాలను కలపడం

సంస్థ గురించి

భారతదేశపు ఆధునిక ఆరోగ్యసంరక్షణ రూపశిల్పి డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి, 1983లో అపోలో హాస్పిటల్స్ నెలకొల్పారు. దేశంలో తొలి కార్పొరేట్‌ ఆస్పత్రి అయిన అపోలో హాస్పిటల్స్ అగ్రగామిగా నిలుస్తూ ఆరోగ్యసంరక్షణపరంగా ప్రైవేట్ రంగంలో విప్లవాన్ని తీసుకువచ్చింది.

ఆసియాలోనే సమగ్రమైన ఆరోగ్య సేవలు అందించే ప్రముఖ సంస్థగా అపోలో హాస్పిటల్స్ ఆవిర్భవించింది. ఆరోగ్యసంరక్షణకు సంబంధించి ఆస్పత్రులు, ఫార్మాసీలు, ప్రాథమిక సంరక్షణ & డయాగ్నాస్టిక్‌ క్లినిక్స్ సహ అనేక రంగాల్లో అపోలో హస్పిటల్స్‌ను చూడవచ్చు. అనేక దేశాల్లో ఈ గ్రూపునకు టెలిమెడిసిన్ సదుపాయాలే కాదు ఆరోగ్య బీమా సేవలు, గ్లోబర్ ప్రాజెక్ట్స్ కన్సల్టెన్సీ, వైద్య కళాశాలలు, ఈ-లెర్నింగ్‌ కోసం మెడ్‌వర్సిటీ, నర్సింగ్, హాస్పిటల్ నిర్వహణ కాలేజీలు, ఒక పరిశోధనా సంస్థ కూడా ఉన్నాయి. అంతే కాదు నిరంతరం సంరక్షణ అందించేందుకు ఆన్‌ లైన్‌ కన్సల్టేషన్ పోర్టల్ ‘ఆస్క్ అపోలో’, అపోలో హోమ్ హెల్త్ ఉన్నాయి.

తక్కువ ధర, అద్భుతమైన వైద్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భవిష్యత్ అవసరాలకు తగిన పరిశోధన, విద్య అనేవి అపోలో వారసత్వంలో మైలురాళ్లు. నిరంతరాయ ఆరోగ్యసంరక్షణ అందించేందుకు ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ఆస్పత్రుల్లో ముందుంది అపోలో హాస్పిటల్స్. ప్రపంచవ్యాప్తంగా వైద్యపరికరాల్లో వేగంగా జరుగుతున్న మార్పులను అందిపుచ్చుకుంటూ భారతదేశంలో అత్యాధునిక ఆవిష్కరణలను అందిస్తోంది. అపోలో హాస్పిటల్స్ చెన్నైలో ప్రవేశపెట్టిన ప్రోటాన్ థెరపీ కేంద్రం అన్నది అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. ఆగ్నేయాసియాలో ఈ కేంద్రం మొదటిది. ఇది ఈ ప్రాంతంలో 3.5 బిలియన్ల జనాభాకు సేవలందిస్తోంది.

భారతదేశంలో ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ విధానాన్ని తొలుత ప్రారంభించింది అపోలో హాస్పిటల్సే. 1987లో సంస్థను నెలకొల్పిన నాటి నుంచి నేటి వరకు 20 మిలియన్లకు పైగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది.

భారతదేశంలో కార్డియాలాజీ సేవలందిస్తున్న అతి పెద్ద సంస్థ అపోలో హాస్పిటల్స్. 9లో ఆరు మిట్రాక్లిప్ ప్రక్రియలు, అద్భుతమైన ఫలితాలతో కూడిన 85 TAVI/TAVR సహ అత్యాధునిక కార్డియాక్ ఇంటర్వెన్షల్ పద్ధతుల ద్వారా పెద్ద సంఖ్యలో కార్డియోవ్యాస్క్యూలర్ కేసులకు చికిత్స అందించింది. అంతే కాదు దేశవ్యాప్తంగా 1,250 MICS CABG ప్రక్రియలు నిర్వహించింది.

నెలకొల్పిన నాటి నుంచి ఇప్పటి వరకు 140 దేశాలకు చెందిన 150 మిలియన్ల మంది నమ్మకాన్ని పొందింది అపోలో హాస్పిటల్స్. రోగులు లక్ష్యంగా పనిచేసే అపోలో లో టీఎల్‌సీ (టెండర్ లవింగ్ కేర్) అనే మంత్రం రోగుల్లో స్ఫూర్తితో కూడిన ఆశను నింపుతోంది.

ఎఐ శక్తితో కూడిన కార్డియోవ్యాస్క్యూలర్ డీసీజ్ రిస్క్ స్కోర్ ఏపీఐ కోసం మైక్రోసాఫ్ట్ ఎఐ నెట్‌వర్క్ తో భారతదేశం నుంచి భాగస్వామ్యం కుదుర్చుకున్నఏకైక సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూప్. రోగుల్లో సీవీడీ ముప్పును 5 నుంచి 7 సంవత్సరాలు ముందుగానే గుర్తించేలా చేయగలుగుతుంది ఏపీఐ. ఇప్పటి వరకు 200,000 మంది రోగులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది.

అబాట్ భాగస్వామ్యంతో భారతదేశంలో తొలి జాతీయ కార్డియాక్ రిజిస్ట్రీ నెలకొల్పిన అపోలో హాస్పిటల్స్.

కృత్రిమ మేధస్సుతో కూడిన వాయిస్ అసిస్టెంట్ ఉపయోగిస్తూ అపాయింట్‌మెంట్లు, సమీపంలోని ఆస్పత్రులు, ఫార్మాసీలను అన్వేషించే నైపుణ్యాన్ని అమెజాన్ అలెక్సా పై ప్రవేశపెట్టనున్నభారతదేశపు తొలి, అతి పెద్ద హాస్పిటల్ గ్రూప్ అపోలో హాస్పిటల్స్.

ఒక బాధ్యతాయుత కార్పొరేట్‌ సంస్థగా అపోలో హాస్పిటల్స్ తన స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని వ్యాపారానికే పరిమితం చేయకుండా భారతదేశాన్ని ఆరోగ్యంగా ఉంచే బాధ్యతను కూడా చేపట్టింది. సంక్రమించని వ్యాధులు (ఎన్‌సీడీ) దేశానికి పెద్ద ముప్పని గ్రహించిన అపోలో హాస్పిటల్స్, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రజలకు ప్రివెంటివ్ హెల్త్‌ కేర్‌పై నిరంతరం అవగాహన కల్పిస్తోంది. అంతే కాదు డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి ఆలోచన “బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్” భారతీయుల హృదయాలు ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేస్తోంది.

సామాజిక చర్యలు ఎన్నింటినో విజయవంతంగా నిర్వహించింది అపోలో హాస్పిటల్స్. అణగారిన వర్గాలకు చెందిన చిన్నారులకు సాయపడేందుకు చేపట్టిన కార్యక్రమం సచీ (సేవ్ ఏ చైల్డ్స్ హార్ట్ ఇనిషియేటివ్), ఇందులో పుట్టుకతోనే గుండె జబ్బులు కలిగిన చిన్నారులకు చికిత్స అందించడం జరుగుతుంది. సహి (సొసైటీ టూ ఎయిడ్ ది హియరింగ్ ఇంపెయిర్డ్), క్యాన్సర్‌ సంరక్షణకు ఉద్దేశించిన క్యూర్‌ ఫౌండేషన్ వంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. భారతదేశంలో ప్రజారోగ్యం విధానాన్ని ప్రవేశపెట్టేందుకు డాక్టర్ రెడ్డి రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం టోటల్ హెల్త్ ఫౌండేషన్. ఆంధ్రప్రదేశ్‌లోని తవణంపల్లె మండలంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకం ఆరోగ్యసంరక్షణలో ఓ ప్రత్యేక నమూనాగా నిలుస్తోంది. పుట్టుక నుంచి బాల్యం, యవ్వనం, యుక్తవయస్సు, వృధ్ధాప్యం వరకు మొత్తం సమాజానికి “సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ” అందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.

అపోలో అందిస్తున్న విస్తృతశ్రేణి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రత్యేక స్టాంపు విడుదల చేసింది. ఓ ఆరోగ్యసంస్థకు ఈ తరహా గౌరవం దక్కడం చాలా అరుదు. అంతే కాదు అపోలో హాస్పిటల్స్ లో తొలి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగి 15 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మరో స్టాంపు కూడా విడుదల చేయడం జరిగింది. దేశంలో ప్రివెంటివ్‌ హెల్త్ కేర్‌ను ప్రోత్సహించడంలో అగ్రగామిగా నిలుస్తూ 20 మిలియన్‌ ఆరోగ్య పరీక్షలు నిర్వహించినందుకు గౌరవసూచకంగా ఇటీవలే ఓ ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల చేసి ప్రభుత్వం అపోలోను గౌరవించింది.

భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న అపోలో ఆస్పత్రి వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్‌‌ సి. రెడ్డి.

అపోలో హాస్పిటల్స్ – వాస్తవాలు & గణాంకాలు
ఆస్పత్రులు 71
బెడ్స్ సంఖ్య 12000
ఫార్మాసీల సంఖ్య 3400
ప్రాథమిక సంరక్షణ క్లినిక్స్ సంఖ్య 90 కి పైగా
డయాగ్నాస్టిక్ కేంద్రాల  సంఖ్య 150
టెలిమెడిసిన్ కేంద్రాల సంఖ్య 110+
వైద్య విద్య, పరిశోధన సంస్థల సంఖ్య 15కు పైగా

మమ్మల్ని సంప్రదించండి